Chandrababu Naidu Rajinikanth : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలవగానే రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవానికి వచ్చారు. రాజకీయాలు మాట్లాడనంటూనే చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పాత ఫోటోను వైరల్ చేస్తూ..  విమర్శలు చేస్తున్నారు. ఇంతకూ ఆ ఫోటోలో ఏముందంటే.. చంద్రబాబు తొలి సారి ఎన్టీఆర్‌ను ధిక్కరించి సీఎం అయిన సందర్భంలో ఎమ్మెల్యేలతో భేటీకి రజనీకాంత్ కూడా వచ్చిన సందర్భంలోనిది.                                                    


చంద్రబాబు లాంటి విజనరీ ఆంధ్రప్రదేశ్ కు కావాలని సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా హీట్ ను పెంచుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు వైసీపీ నేతలు. కానీ చంద్రబాబు, రజినీకాంత్ దోస్తీ ఇప్పటికాదు.టీడీపీ చరిత్రలో కీలకమైన ఘట్టాల్లో ఒకటిగా చెప్పుకునే వైశ్రాయ్ ఘటన సంఘటనలోనూ రజినీకాంత్ ఉన్నారని ఈ ఫోటో ఇప్పుడు తెగవైరల్ అవుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ ను విబేధించిన చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో తన బలాన్ని నిరూపించుకుంటున్న టైమ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్..టీడీపీ ఎమ్మెల్యేలున్న క్యాంప్ కు వచ్చి చంద్రబాబుకు మద్దతు పలికారు.                                                       


అప్పటి పరిస్థితుల్లో చంద్రబాబును సమర్థించిన వారే ఎక్కువ. ఎన్టీఆర్‌పై  ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండానే చంద్రబాబుతో ఉండాల్సిన అవసరాన్ని టీడీపీని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలకు వివరించారంటూ ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఆ తర్వాతది అంతా చరిత్ర . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను  ఆ తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ ను విజయవంతంగా పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఒక్కరిగా చంద్రబాబు నిలిచిపోయారు. ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న టైమ్ లో మళ్లీ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనటం..రాజకీయాలు మాట్లాడకూడదు అయినా పర్లేదు మాట్లాడతాను అంటూ చంద్రబాబు విజన్ గురించి మాట్లాడటం అధికారపార్టీని కలవరపెట్టడంతో పాటు పొలిటికల్ గానూ డిబేటబుల్ టాపిక్ గా మారింది.             


చంద్రబాబు తనకు 30 ఏళ్ల నుంచి స్నేహితుడని రజనీకాంత్ స్వయంగా చెప్పుకున్నారు. ఇద్దరూ వేర్వేరు రంగాల్లో తీరిక లేకుండా ఉండే వ్యక్తులే. అయినప్పటికీ ఇటీవల చాలా సేపు చంద్రబాబుతో సమావేశం అయ్యానని రజనీకాంత్ చెప్పారు. ఆయన విజన్‌ను ప్రశంసించారు. ఇలా ప్రసంగించినందుకే.. వైఎస్ఆర్‌సీపీ నేతలు పాత ఫోటోలు తీసి.. అప్పట్లో ఎన్టీఆర్‌పై తిరుగుబాటుకు రజనీకాంత్ కూడా మద్దతిచ్చారని చెబుతున్నారు.