YSRCP complaint to the Human Rights Commision : ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీ నేతలపై దాడులు ఆగడం లేదని వైసీపీ నేతలంటున్నారు. ఇటీవల పాలేటి రాజ్ కుమార్ అనే వ్యక్తిపై చేసిన దాడి గురించి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తనను ఇంటిలో నుండి బలవంతంగా కిడ్నాప్ చేసి హింసించారని, చంపుతామని ప్రతిరోజూ బెదిరిస్తున్నారని, కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవట్లేదని పాలేటి రాజ్ కుమార్ ఆరోపించారు.
ఇది ఒక్కటే కాదు దాడులు ఆగడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. పుంగనూరులో తమ నేత ఇంటిపై దాడి చేశారని సోషల్ మీడియాలో ఆరోపించారు.
విజయవాడలో తమ పార్టీ నేతల ఇల్లు కూలగొట్టారని వైసీపీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి ముర్ముకు కూడా ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతి ని కోరారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ఏపీలో చట్టం లేదు. స్వేచ్ఛ లేదు. అన్యాయమే రాజ్యమేలుతోందని వాపోయారుఏపీలో టీడీపీ దాడులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారని, రాష్ట్రంలో రాక్షసపాలన మొదలైందని విమర్శించారుసం ఫిర్యాదు చేస్తామన్న కూడా పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ నీరుగారి పోయిందని ఆరోపిస్తున్నారు.