Tirumala Laddu Row :


ముఖ్యంత్రి చంద్రబాబును తిరుమల లడ్డు కల్తీ ఘటన అంశంలో.. గట్టిగా తిట్టి పోయాలని ప్రధాని నరేంద్రమోదీకి వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి విన్నవించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన ఆయన.. అసత్యాలు చెప్పడం చంద్రబాబుకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. చంద్రబాబు వైఖరితో కోట్లాది మంది భక్తులు ఆవేదనలో ఉన్నారని జగన్‌ అన్నారు.


చంద్రబాబును ఎందుకు ప్రధాని తిట్టాలో 8 పేజీల లేఖలో జగన్ వివరణ:


            తిరుమల లడ్డు వివాదంలో అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ వెంటనే కలుగ చేసుకోవాలని కోరుతూ.. ప్రధానికి వైకాపా అధ్యక్షుడు జగన్ 8 పేజీల లేఖ రాశారు. దేశం మొత్తం ప్రధాని స్పందన కోసం ఎదురు చూస్తోందని లేఖలో జగన్ వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెప్పడాన్ని అలవాటుగా మార్చుకొని తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన జగన్‌.. ఇకనైనా ప్రధాని కలుగచేసుకొని చంద్రబాబును మందలించాలని కోరారు. కేవలం రాజకీయాల కోసమే చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని.. ఇప్పుడు ఆయనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను కూడా దిగజారుస్తున్నారని జగన్ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం దేశంలోని కోట్లాది మంది హిందువులను మనోవేదనకు చంద్రబాబు కారణం అయ్యారంటూ చంద్రబాబుపై 8 పేజీల లేఖలో తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అత్యంత ధనికుడైన కళియుగ దైవం శ్రీ తిరుమల శ్రీవారి కార్యక్రమాలకు కస్టోడియన్‌గా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ విమియోగించే ఘీ సేకరణంలో అవలంబించే విధానాలను లేఖలో మోదీకి వివరించిన జగన్‌.. చంద్రబాబు చర్యలతో ముఖ్యమంత్రి పదవికే గాక.. శ్రీవారి ప్రభ కూడా మసకబారే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానిగా మీ రియాక్షన్ కోసం కీలస సమయంలో దేశం యావత్‌ ఎదురు చూస్తోందని .. ఇదే సమయంలో తప్పు మీద తప్పులు చేస్తూ అబద్ధాలు చెబుతూ దేవుడికి అన్యాయం చేస్తున్న చంద్రబాబును తీవ్రంగా తిట్టిపోయాలని జగన్ కోరారు. ఈ విషయంలో నిజానిజాలు కూడా తేటతెల్లం కావాలని కోరారు.


చంద్రబాబును తిట్టిపోయడం సహా నిజాలు బయట పెడితే కోట్లాది మంది శాంతిస్తారు:


తిరుమల లడ్డు వివాదంలో నిజాలు వెలుగులోకి తేవడం సహా చంద్రబాబు తన అబద్ధాలతో కోట్లాది మంది మెదళ్లలోకి ఎక్కించిన అసత్యాలను పారదోలాలని.. దీని కోసం ప్రధానిగా మీరు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు అడల్టరేట్‌ అయిన ఘీని TTD ఎప్పుడో రిజెక్ట్ చేసిందని.. ఆలయం దరిదాపులకు కూడా రానివ్వలేదని జగన్ వివరించారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబే తప్పుడు ఉద్దేశాలతో ఒక రాజకీయపార్టీ మీటింగ్‌లో దేవుడు గురించి మాట్లాడి లేని వివాదాన్ని సెప్టెంబర్‌ 18న తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు.


తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర బీజేవైఎమ్ కార్యకర్తల ధర్నా:


రెండు రోజులుగా తాడేపల్లి నివాసంలో ఉన్న జగన్ మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. జగన్ హయాంలోనే తిరుమల పవిత్రత దెబ్బతిందంటూ బీజేవైఎం కార్యకర్తలు తాడేపల్లిలోని జగన్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకొని తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.