YS Jagan will attend the assembly: వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అసెంబ్లీకి హాజరవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ...ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి జగన్ తో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలన్న ఆలోచనే కారణం అంటున్నారు.
జగన్ పై అనర్హతా వేటు వేస్తామంటున్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్
అసెంబ్లీకి హాజరు కాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు పదేపదే జగన్ అనర్హత గురించి మాట్లాడుతున్నారు. అయితే వారికి బుద్ది పుట్టింది చేసుకోనివ్వండి ని అని జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటీవల ప్రెస్మీట్ లో స్పందించారు. అయితే అధికార పార్టీకి అవకాశం ఇవ్వకూడదని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే ఆలోచన చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కంటిన్యూస్ గా మూడు సెషన్లు లేదా.. అరవై రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుంది. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే జగన్ కు ఆ అర్హత వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి అవకాశం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిగతా పని పూర్తి చేస్తారు.
అధికార పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక్క రోజు హాజరయ్యేలా ప్లాన్
అసెంబ్లీకి హాజరు కాకపోయినా లీవ్ లెటర్ పంపినా అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. అయితే స్పీకర్ ఆ లీవ్ సమంజసమా కాదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ ఒక్క రోజు అసెంబ్లీకి పోతే అసలు సమస్య ఉండదు కదా అన్న ఆలోచన చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అలా ఒక్క రోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నారు.
మిగిలిన ఎమ్మెల్యేల గురించి ఆలోచనతోనే ఈ నిర్ణయం ?
పులివెందులలో ఉపఎన్నికల వస్తే ప్రజలు తమ సత్తా ఏంటో కూటమికి చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ తోపాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడితే.. ప్రభుత్వ పవర్ తో ఆయా సీట్లలో గెలిచే ప్రయత్నం చేస్తుందని..అది వైసీపీకి మరింత సమస్యగా మారుతుందని అనుకుంటున్నారు. అందుకే అనర్హతా వేటు విషయంలో జగన్ కు ఎలాంటి భయం లేకపోయినా.. మిగిలిన ఎమ్మెల్యేల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని వైసీపీవర్గాలు చెబుతున్నాయి.
Also Read: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్, ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు