Pition On Why AP Needs Jagan : "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డికి . ఏపీహైకోర్టు (AP HighCourt) నోటీసులు జారీ చేసింది. సజ్జలకు వ్యక్తిగత హోదాలో కోర్టు ఈ నోటీసులు పంపింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం (WhyY AP Needs Jagan  ) నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసుపై న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే పిల్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తమ పిల్‌కు విచారణ అర్హత ఉందని న్యాయవాదులు ఉమేష్, శ్రీనివాస్ చెప్పారు.                           
   
‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, ప్రభుత్వ సొమ్ము వాడటం తదితర అంశాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారని న్యాయవాదులు  తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సీఎస్‌, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.



వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఎన్నికలకు రెండేళ్ల ముందే వైసీపీ మేల్కొంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజల్లో ఉండేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, మా నమ్మకం నువ్వే జగన్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ. తాజాగా ఇటీవలే వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే  అయితే ఈ కార్యక్రమాలన్నీ ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారు.               


రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచలన మేరకు ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని కూడా పిటిషన్‌లో ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.