AP New DGP :   ఎన్నికలకు ముందు ఏపీలో కొత్త పోలీస్ బాస్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.  ప్రస్తుత డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి పర్మినెంట్ డీజీపీ కాదు. గౌతం సవాంగ్‌ను తప్పించిన తర్వాత ఇన్‌ఛార్జి డీజీ హోదాలో నియమించారు. త 16 నెలలుగా ఇన్‌ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు.  రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి యుపీఎస్‌సీ ద్వారా నియామకం జరగాలి. నియమితులైన అధికారి కనీసం రెండేళ ్ళపాటు పదవిలో కొనసాగాల్సి ఉంటుంది.


సుదీర్ఘ కాలంగా ఇంచార్జ్ డీజీపీగా ఉంచడం నిబంధనలకు విరుద్దం


ప్రభుత్వం రాజేంద్రనాథ్‌రెడ్డిని ఇంచార్జ్  డీజీపీగా నియమించినప్పటికీ కేంద్రానికి ప్యానెల్‌ పంపలేదు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌ఛార్జిగా ఎక్కువ కాలం కొనసాగడం కుదరనందున ఆయన పేరు సహా డీజీ ర్యాంకు అధికారుల పేర్లతో జాబితా పంపాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో రెండు సార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేనందున ఈ ఏడాది జనవరిలో డీఓపీటీ నుంచి మరో లెటర్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు.  నిజానికి యుపీఎస్‌సీ ద్వారా నియామకం జరగాలి. 


ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి డీజీపీ నియామకం తప్పనిసరి ! 


డీజీపీ నియామకానికి సంబంధించి యుపీఎస్‌సీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న రాజేంద్రనాధ్‌ రెడ్డి నియామకాన్ని ఆమోదం తెలియచేయాలన్నా.. ఇంకెవరినైనా నియమించాలన్నా యుపీఎస్‌సీ సూచించిన వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవచ్చు. తాజా పరిస్ధితుల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కసిరెడ్డితోపాటు మరో ఐదు పేర్లతో కలిపి డీజీపీ నియామకం కోసం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి గత 16 నెలలుగా ఇన్‌ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది. అప్పటి వరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఆయన్ను అక్కడి నుంచి రిలీవ్‌ చేసి ఇన్‌ఛార్జి డీజీగా నియమించిన దాదాపు వారం తర్వాత ఏసిబి డీజీగా ఫుల్‌ ఛార్జి ఇస్తూ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


రేసులో సీనియర్ ఐపీఎస్‌ లు ! 


రాజేంద్రనాధ్‌ రెడ్డి కన్నా సీనియర్లు రేస్‌లో ఉన్నారు.  ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ పి సీతారామాంజనేయుల కు రాష్ట్ర పోలీసు ఫోర్స్‌ చీఫ్‌గా అవకాశం దక్కనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది.  1992 బ్యాచ్‌కు చెందిన పిఎస్సార్‌కు 2026 ఆగష్టు వరకు పదవీ కాలం ఉంది . ఇక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన 1989 బ్యాచ్‌కు చెందిన ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్‌ వచ్చే అవకాశం లేకపోలేదని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు.   92 బ్యాచ్‌కు చెందిన మరో సీనియర్‌ అధికారి హరీష్‌ కుమార్‌ గుప్తాకు 2025 వరకు పదవీ కాలం ఉంది. ఈయన ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన హాసన్‌ రేజా పదవీ కాలం జూలైతో ముగియనుంది.   1991 బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ వెయిటింగ్‌లో ఉన్నారు. ఇంటిలిజెన్స్‌ డీజీగా పీవీ సునీల్‌కుమార్‌ను నియమించే అవకాశం లేకపోలేదని ప్రచారంలో ఉంది.