Mekapati Goutham Reddy : ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ( Mekapati Goutham Reddy ) హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో అందర్నీ కలచి వేస్తోంది. రాజకీయాల్లో శత్రువులు లేని నేతగా ఆయన అందరి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రాష్ట్రం కోసం ఆయన తన బాధ్యతల్ని సంపూర్ణ స్థాయిలో నిర్వర్తించారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో ( Dubai ) ఏపీ కోసం పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో ప్రయత్నించే ఆదివారం తెల్లవారుజామునే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజులోనే ఆయన గుండెపోటుకు గర చనిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మేకపాటి గౌతం రెడ్డి దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుండి ఏం చేశారో కుటుంబం అందించిన వివరాలు ఇవి.
రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరిన మంత్రి మేకపాటి
06.00 గం.లకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్న మంత్రి
06:30 గం.ల వరకూ మంత్రిగారు ఫోన్ లతో కాలక్షేపం
07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి
07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి గౌతమ్ రెడ్డి
07:15గం.లకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి
7:16 గం.లకు కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి
07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు
07:20 గం.లకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం
07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి
07:22 "నొప్పి పెడుతుంది కీర్తి" అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది
07:27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది
08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు
09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు
09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో
వాస్తంగా చెప్పాలంటే ఉదయం ఆరుర గంటలకు మేకపాటి గౌతంరెడ్డి నిద్రలేచారు. ఏడున్నర గంటల కల్లా ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురైన అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. గుర్తించిన సిబ్బంది వెంటనే.. అది కూడా పది నిమిషాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. సాధారణంగా గుండెపోటుకు గురైన వారిని గంటలో ఆస్పత్రికితీసుకెళతే ప్రాణాపాయం తక్కువగా ఉంటుందని చెబుతూంటారు. కానీ గౌతం రెడ్డి విషయంలో ఆ గోల్డెన్ అవర్ కూడా పని చేయలేదు. పది నిమిషాల్లోనే ఆస్పత్రికి తీసుకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది.