West Godavari Special Train: నర్సాపూర్ నుండి హైదరాబాద్ కు వెళ్లే వారికి రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న రైల్వే శాఖ, నర్సాపూర్ నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు వీలుగా రైలు నడపనున్నట్లు ప్రకటించింది. నర్సాపూర్ నుండి వికారాబాద్ వరకు ఈ ప్రత్యేక రైలు నడవనుంది. నర్సాపూర్ నుండి వికారాబాద్ కు వెళ్లే ప్రత్యేక రైలు ఆదివారం రాత్రి 8 గంటలకు వెళ్లనుంది. ఈ రైలు గుంటూరు, సికింద్రాబాద్, లింగంపల్లి మీదుగా నడవనుంది. రాత్రి 8 గంటలకు డిపార్చర్ అయ్యే రైలు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వికారాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లాల్లోని పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. 


నర్సాపూర్ నుండి కొల్లాంకు ప్రత్యేక రైళ్లు


ఇరు తెలుగు రాష్ట్రాల నుండి అయ్యప్ప భక్తులు ఏటా పెద్ద ఎత్తున కేరళలోని శబరిమలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 21, 28 తేదీల్లో నర్సాపూర్ నుండి కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు భీమవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుబాబు వెల్లడించారు. 07131 నంబరుతో ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు రైలు బయలుదేరుతుందని వెల్లడించారు. విజయవాడ, తిరుపతి, కాట్ పాడి, తిరుపూర్, కొట్టాయం మీదుగా తర్వాతి రోజు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కొల్లాం స్టేషన్ కు చేరుకుంటుందని వెల్లడించారు. తిరిగి అదే రోజు రాత్రి రైలు ప్రారంభం అవుతుందని, రాత్రి 8 గంటల 45 నిమిషాలకు 07132 నంబర్ తో ఉన్న రైలు కొల్లాం స్టేషన్ నుండి బయలు దేరి తర్వాతి రోజు రాత్రి 10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు జిల్లాలోని పాలకొల్లు, భీమవరం జంక్షన్, టౌన్, ఆకివీడు స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు. 


భక్తుల సౌకర్యార్థం


ఏటా సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తారు. వీరి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్ - కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ - కొల్లాం(07121) ఈనెల 27వ తేదీ, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో నడవనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ - కొల్లాం(07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్(07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్ - కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో నడవనున్నాయి. కొట్టాయం - సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వెల్లడించారు.