కాకా హోటల్ కు కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. బిల్లు చూసి నిర్వాహకులు షాక్ తిన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండు సమీపంలో ఉన్న చిన్నపాటి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు ముళ్లగిరి మంగమ్మ. సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.కోట్లలో విద్యుత్తు బిల్లు రావడంతో ఆమె అధికారులకు ఫిర్యాదుచేశారు. సాధారణంగా ప్రతి నెలా రూ.700 వరకు బిల్లు వస్తుండేది. కానీ గత రెండు నెలలుగా వేల రూపాయల్లో బిల్లు వస్తుంది. ఆగస్టులో రూ.47,148 బిల్లు రావడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటరులో లోపం ఉందంటూ విద్యుత్తు సిబ్బంది కొత్త మీటర్ బిగించారు. ఈసారి ఏకంగా కోట్లలో బిల్లు వచ్చింది. సెప్టెంబరులో రూ.21,48,62,224 బిల్లు రావడంతో మంగమ్మ మళ్లీ అధికారులకు మొరపెట్టుకున్నారు. సాంకేతిక లోపంతో ఇంత బిల్లు వచ్చి ఉంటుందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యుత్ అధికారులు తెలిపారు.
Also Read: Internet Apocalypse: ఇంటర్నెట్ యుగం ముగిసిపోనుందా? సౌర తుపానుతో భారీ డ్యామేజ్!
సాంకేతిక లోపంతో..
రోడ్డు పక్కన చిన్న టిఫిన్ సెంటర్ కి ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 వరకు కరెంట్ బిల్లు వచ్చేది. కానీ సెప్టెంబర్ నెలలో నెలలో మాత్రం అక్షరాలా రూ.21 కోట్లకు పైగా బిల్లు వచ్చింది. బిల్లును చూసిన హోటల్ నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్ కు ఈ నెలలో.. 21 కోట్ల 48 లక్షల 62 వేల 224 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి ఘటనతో హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందారు. ఇంత హోటల్‌కు అంతా బిల్లా అంటూ షాక్ తిన్నారు. గత నెలలోనూ రూ.47,148 విద్యుత్ బిల్లు వచ్చిందని ఆవేదన చెందారు. దిక్కుతోచక విద్యుత్ శాఖ ఆఫీసుకు చుట్టూ తిరుగుతున్నారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో కరెంట్ మీటర్లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు కొత్త మీటరు ఏర్పాటుచేశారు.
రూ.21 కోట్ల బిల్లు
కొత్త మీటరు పెట్టిన తర్వాత కూడా భారీగా బిల్లు రావడంతో బాధితులు అవాక్కయ్యారు. ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 మధ్య బిల్లు వస్తుందని, ఈసారి ఏకంగా రూ.21 కోట్ల బిల్లు రావడంతో భయాందోళనకు గురయ్యామని బాధితులు అంటున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Also Read: Rs 1.48L Electricity Bill: కూలీ కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్.. మూడు బల్బులకు రూ.లక్షన్నర బిల్లు