Weather Updates In Andhra Pradesh And Telangana: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదు కానున్నాయి. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి. గత ఐతేళ్లతో పోలిస్తే ఈ సారి వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 15 న ఉత్తర భారతదేశం నుంచి వీచనున్న పొడిగాలుల వల్ల ఎండల తీవ్రత మరింత అధికం అవుతుంది. కొన్ని చోట్ల 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వనుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. విశాఖ​, విజయవాడ​, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో వేడి ఎక్కువగా ఉంటుంది. విశాఖలో అయితే ఇక ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. బాపట్లలో 34 డిగ్రీలు, కాకినాడలో 34.7 డిగ్రీలు, కళింగపట్నంలో 32.8 డిగ్రీలు, నందిగామలో 38.4 డిగ్రీలు, నెల్లూరులో 34 డిగ్రీలు, తునిలో 36.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 34 డిగ్రీలు, అమరావతిలో 36.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికం అవుతుంటే, రాత్రిపూట చలి గాలులు వీస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ​, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకనుంది.  రాత్రులు కాస్తంత చల్లగా ఉన్నా మధ్యాహ్నాలు మాత్రం ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. రానున్న పది రోజుల దాక ఇదే పరిస్ధితి. జాగ్రతలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. 






తెలంగాణ వెదర్ అప్‌డేట్
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలైన సూర్యాపేట​, మహబూబాబాద్, నల్గొండ​, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల​, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలను తాకే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలు సైతం దాటుతుంది. మరోవైపు హైదరాబద్ లో వేడిగా 38-39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ వరంగల్, నల్గొండ​, నిజామాబాద్, రామగుండం వైపు ఎండల తీవ్రత కారణంగా ఉక్కపోత పెరుగుతుంది.


Also Read: Gold-Silver Price: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం - వెండి ధర మాత్రం నిలకడే, తాజా ధరలు ఇవీ


Also Read: Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోతే బరువు పెరగడమే కాదు, డయాబెటిస్ కూడా రావచ్చు