Weather Latest News: నైరుతి రుతుపవనాల కదలిక చురుగ్గా ఉంది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి శనివారానికి మరింత ముందుకు వెళ్లినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ అంతర్గత కర్నాటక పరిసరాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని తెలిపారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఏర్పడిన ఉత్తర - దక్షిణ ద్రోణి శనివారానికి బలహీనపడిందని వాతావరణ అధికారులు చెప్పారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల రాగల 48 గంటల్లో మోస్తరు వర్షాలు కురియనున్నాయని వెల్లడించారు.
AP Weather ఆంధ్రప్రదేశ్ లో
ఏపీలో రాగల మూడు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వెల్లడించింది. అయితే ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు.
Telangana Weather: ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉంది. ఏకంగా 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో మే 17న అక్కడకక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. గాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
నేడు హైదరాబాద్, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘‘ఈ రోజు నుంచి తక్కువ వర్షం పడనుంది. ఇంతకాలం రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడి బంగాళాఖాతంలోని వెళ్లింది. ఇది మరో రెండు రోజుల్లో బర్మా దేశం వైపుగా వెళ్లనుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని తేమను తీసుకొని వెళ్లనుంది. దీని వల్ల వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. మరీ ఎక్కువగా వర్షాలుండవు.
రుతుపవనాలు జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. దీని వల్ల వర్షాలు ఒక్కసారిగా పెరుగుతాయి. అంతదాక అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. ఎండల తీవ్రత మెల్లగా పెరగనుంది. మే 23 నుంచి విశాఖపట్నం నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. రుతుపవనాల వర్షాలు పెరగడంతో ఈ వేడి జూన్ మొదటి వారంలో తగ్గుముఖం పట్టనుంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడ వేడి మరో మూడు రోజుల్లో పెరగనుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు.