Rain in Telangana Andhra Pradesh: అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో నేడు కూడా వర్షాలు కురవనున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుతో పాటు యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. నేడు కూడా తీరం వెంబడి కాస్త బలమైన గాలులు వీయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏపీలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మిగతా చోట్ల మాత్రం ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు (Rains In Andhra Pradesh) 
ఏపీలో నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రం వాతావరణం పూర్తిగా పొడిగానే ఉండనుంది. రాయలసీమలో తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడనున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.






‘‘ఇక ఈ అకాల వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టనుంది. ప్రస్తుతానికి ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడి గాలులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెంచనుంది. ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు దగ్గరగా నమోదవ్వనుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్యలో నమోదుకానుంది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మొత్తం రాయలసీమ జిల్లాలు, ప్రకాశం పశ్చిమ భాగాలు, నెల్లూరు పశ్చిమ భాగాలు, గుంటూరు, కృష్ణా, విజయవాడ​, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎండలు విపరీతంగా ఉండనుంది. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనుంది. మరో వైపున ఉత్తరాంధ్ర విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాయంకాలం విశాఖ ఏజెన్సీ, మారేడుమిల్లి వైపు కొన్ని వర్షాలుంటాయే గానీ ఎండలు మాత్రం తగ్గే ప్రసక్తి లేదు.


తెలంగాణలో ఎండలు (Rains In Telangana)
మరోవైపున తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాలు - భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట​, నల్గొండ​, యాదాద్రి భువనగిరి, మహబూబబాద్, ములుగు, మంచిర్యాల​, ఆదిలాబాద్, కుమరంభీం అసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామబద్, సిద్ధిపేట​, సిరిసిల్ల​, మేడ్చల్ మల్కాజ్ గిరి, కరీంనగర్, కమారెడ్డి, సంగరెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 మధ్యలో ఉండనుంది. హైదరబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీల దాక ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.



తెలంగాణలో నేటి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రత నిన్న 43 డిగ్రీలుగా ఆదిలాబాద్‌లో నమోదైందని వెల్లడించింది.






ఏపీలో కొన్ని చోట్ల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ప్రజలు రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అలల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని మత్స్యకారులను హెచ్చరించారు.