ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు గురువారం ఉపరితల ద్రోణి ఏర్పడింది. అది ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. తమిళనాడు తీరప్రాంతాల వరకు విస్తరించింది ఉంది. సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి కొనసాగుతుంది.
ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో శనివారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా.. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చెరువులు నిండు కుండలను తలపిస్తుండగా, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు బెంబేలెత్తించాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Also Read: కరోనాపై పోరాటంలో మరో ముందడుగు.. కొవిడ్19 యాంటీవైరల్ మెడిసిన్ రెడీ.. అద్భుతమైన ఫలితాలు
Also Read: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
Also Read: ఇల్లు శుభ్రం చేశాక చీపురుని ఇలా పెడితే దరిద్రమట..మీకు తెలుసా..