తెలుగు రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌‌లో వరుసగా రెండో రోజు భారీగా వర్షం పడింది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన వానలు పడుతున్నాయి.






తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వానలు పడుతున్నాయి. మరోవైపు ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ, ఏపీలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయి.
శనివారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రెండు రోజుల పాటు వానలు పడతాయని పేర్కొన్నారు.





 


ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశముంది. 


మరోవైపు.. ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మరో ఐదు రోజులపాట వర్షాలు పడనున్నాయి.


Also Read: Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం... చిగురుటాకులా వణికిన భాగ్యనగరం.. జీహెచ్ఎంసీ అలర్ట్!


Also Read: Heavy Rains: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే