కోమరిన్ దానిని అనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
దక్షిణ అండమాన్‌లో నేడు ఏర్పడనున్న కొత్త అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు మరో వర్షపు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. బంగాళాఖాతాంలో వాయుగుండం ఏర్పడి దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read: Tomato: మళ్లీ టమాటా ధరలు పెరుగుతాయ్... వచ్చే రెండు నెలలూ ఇదే పరిస్థితి... కారణాలు వెల్లడించిన క్రిసిల్
అల్ప పీడనం ప్రభావం అధికమైతే దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యానాంకు సైతం వర్షపు ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మత్స్యకారులు డిసెంబర్ 2 వరకు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 3 వరకు రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో ఇలా..
దక్షిణ అండమాన్‌లో నేడు ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్కడో ఓ చోట తేలికపాటి నుంచి చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !