AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత దాదాపు తగ్గిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి ఏపీ వైపు గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల చల్లగా ఉంటుంది. మరికొన్ని చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాయలసీమలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది.


ఏపీ వెదర్ అప్‌డేట్స్..
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. విశాఖ, విశాఖనగరం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.  






ఏపీలోని రాయలసీమలో నిన్న కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. నేటి నుంచి రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో అత్యల్పంగా కోస్తాంధ్రలో కళింగపట్నంలో 17.9 డిగ్రీలు, రాయలసీమలోని ఆరోగ్యవరంలో 17.5, అనంతపురంలో 17.9 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 18.6, జంగమేశ్వరపురంలో 19 డిగ్రీలు, నందిగామలో 18.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంది. ఉదయం వేళ ఏజెన్సీలో చలి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని.. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాష్ట్రానికి ఎలాంటి సూచన లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై కొంతమేర ఉండటంతో చలి గాలులు వీస్తాయి. 
Also Read: Shiva Parvathi Theatre: కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్‌ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం
Also Read: Karimnagar: కరీంనగర్ లో హైడ్రామా... బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం... అరెస్టు చేసిన పోలీసులు
Also Read: LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి