ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది.  కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా ఆరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించింది. మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23వ, 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా.  


ఉపరితల ఆవర్తనంతో దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.


ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారుల అంచనా.


తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశముంది.


Also Read: Horoscope Today: ఈ రోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు..మీ రాశిఫలితం ఎలా ఉందో చూసేయండి..


Also Read: KKR vs RCB, Match Highlights: అయ్యో ఆర్సీబీ.. ‘ఈ సాల’ కూడా కప్పు మిస్.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం!