Krishna Floods : ఇదే వరద కొనసాగితే వారంలో డ్యాములు ఫుల్ - ఆశలు రేపుతున్న కృష్ణా జలకళ

Andhra Pradesh : కృష్ణా ప్రాజెక్టుల్లో జలకళ కనిపిచండం ఖాయంగా కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.

Continues below advertisement

Krishna Water :   శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది.  సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3  లక్షలకుపైగా  క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 60 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 120 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది.    ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు  కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది..  జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలంకు వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి  వరద నీరు  వెల్లువలా వస్తోంది. 

Continues below advertisement

 ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. ప్రస్తుతం సంగమతీరం ప్రాంతం సంద్రాన్ని తలపిస్తోంది. గత ఐదురోజులుగా శ్రీశైల జలాశయంకు వరద పోటెత్తడంతో సంగమేశ్వరం వద్ద ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. సంగమేశ్వరం జల వారధి కావడంతో ఆలయ ప్రధాన అర్చకులు   అంత్య పూజలు నిర్వహించారు. ఇక వరద జలాలు ఆలయంను ముంచెత్తాయి. సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరవశించింది. దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి వెళ్లారు. గత ఏడాది పెద్దగా వరద రాకపోవడం.. ప్రాజెక్టులో నీరు త్వరగా అయిపోవడంతో గత ఫిబ్రవరిలో సంగమేశ్వరం ఆలయం బయటపడింది. మళ్లీ జూలైలోనే జలాధివాసంలోకి వెళ్లింది. 

శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది.. తుంగభద్ర జలాశయంలో 28 గేట్ల ద్వారా లక్ష 3 వేల క్యూసెక్కుల చొప్పున అధికారులు నీరు విడుదల చేస్తున్నారు. ఇక, సుంకేసుల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.. ఇక, తుంగభద్ర నుంచి నీటి విడుదల లక్షా 50 వేలకు పెంచే అవకాశం కూడా ఉంది.. జూరాల నుంచి ఇప్పటికే 2 లక్షల 51 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.. ఇలా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది..రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు.. రాబోయే 15 రోజుల్లో కఅష్ణ బేసిన్‌ లోని అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు..  ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. సోమ లేదా మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.                    

మరో వైపు గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో నీళ్లు నిలిపే అవకాశం లేదు. అదే సమయలో కృష్ణా ప్రాజెక్టులు ఫుల్ కాలేదు. సాగర్ డ్యామ్ కూడా నిండితే.. వచ్చే సీజన్ వరకు తెలుగు రాష్ట్రాలకు నీటి సమస్య ఉండదని అంచనా వేస్తున్నారు.                                       

 

Continues below advertisement
Sponsored Links by Taboola