Steel Plant News : స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చేందుకు జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ బిడ్ గడువును మరో ఐదు రోజులు పొడిగిస్తూ.. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఈ గడువు వరకూ 21 సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల పొడిగింపు ఇవ్వడంతో 20వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ చాన్స్ ఉన్నట్లు అనుకోవచ్చు. 


స్టీల్ ప్లాంట్ బిడ్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా పాల్గొన్నారు.  ఇరవై కిలోమీటర్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో ర్యాలీ నిర్వహించిన తర్వాత EOI కోసం రెండు సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. ఈవోఐ ప్రకారం అయితే నగదు లేదా ముడి సరకు మూలధనంగా సమకూర్చాలి.  క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని నెలకు రూ. 850 కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటుందని జేడీ లక్ష్మినారాయమ ప్రకటించారు.   తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కసారి వందరూపాయలు ఇస్తే చాలని ఆయన లెక్కలు చెప్పారు.  మెయిన్ గేట్ ఎదుట నుంచే విరాళాలు సేకరణ ప్రారంభిస్తామన్నారు.  తొలి మొత్తంగా రూ. 200 విరాళాలు సేకరణ ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలి...ఆ ఉద్దేశంతోనే వర్కింగ్ క్యాపిటల్ బిడ్డింగ్ లో పాల్గొన్నానని ఆయన చెబుతున్నారు.  కేంద్రం ప్లాంట్ ను క్లీన్ షేవ్ చేయాలని చూస్తే క్లియర్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు.  


 స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో సింగరేణి సంస్థ బిడ్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బిడ్ దాఖలుకు చివరి తేదీ ఈ రోజే అనుకున్న సింగరేణి అధికారులు సాయంత్రం ఐదున్నర గంటల వరకూ సమయం అడిగారు. తర్వాత  సమయాన్ని పెంచిన విషయాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  విశాఖ ఉక్కు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్ దాఖలుకు ఆరు అంతర్జాతీయ స్టీల్ ఎక్స్ పోర్టర్స్ ఆసక్తి చూపించారు. ఓ  ఉక్రెయిన్ సంస్థ కూడా దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలు్సతోంది.  ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ సంస్థ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో  మూలధనం కింద నిధులు ఇచ్చి స్టీల్ తీసుకోవడానికిఆ సంస్థ ముందుకు వచ్ిచంది.  ఉక్రెయిన్  సంస్థ పేరు  జె.ఎస్.పీ.ఎల్ గా భావిస్తున్నారు.  పెంతర్ బ్రాండ్ వేసుకుని ఉక్కు అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తోంది.  అలాగే మJSW, MS అగర్వాల్. వైజాగ్ ప్రొఫైల్ , నారాయణ ఇస్పాత్ వంటి సంస్థలు ఈవోఐ బిడ్లు దాఖలు చేశాయి. 
 


స్టీల్ ప్లాంట్‌కు  మూలధనం కోసం జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ... స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అన్నట్లుగా ప్రచారం జరగడంతో రాజకీయంగానూ  చర్చనీయాంశం అయింది. అయితే  ఈ బిడ్ గెల్చుకున్న వారు మూలధనం సమకూర్చి దానికి తగ్గట్లుగా తక్కువ ధరకు స్టీల్ మాత్రమే కేటాయిస్తారని ఎలాంటి యాజమాన్య హక్కులు రావని స్టీల్ ప్లాంట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.