Dastairi father attacked :   కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తండ్రిపై దాడి జరిగింది. పులివెందులలో ఆటో నడుపుకుంటూ షేక్ హజీ వల్లి జీవన కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్దకు వెళ్లాడు. అక్కడ తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.        


శివరాత్రి వేడుకలకు వెళ్లిన హాజీపీరాపై దాడి చేసిన వైసీపీ వర్గీయులు                                     


 శివరాత్రి జాగరణకు వెళ్లిన హాజీపీరాను అడ్డగించి దాడి చేశారు. ‘‘దస్తగిరి తండ్రివి నీవేనా అని అడిగి.. జగన్ రెడ్డిని విమర్శించి ఆయనతో పోటీపడే స్ధాయి నీ కొడుక్కువుందా?... దస్తగిరిని ఎలాగైనా చంపేస్తాము’’ అని సదరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే జగన్ పేరుతో బెది రించి దాడి చేశారు కాబట్టి వైసీపీకి చెందిన వారే అని దస్తగిరి తండ్రి హాజిపీరా ఆరోపించారు. పులివెందుల మండలం నామా లగుండు వద్ద దాడి చేశారని బాధితుడు హాజీపీరా చెప్పుకొచ్చారు.                            


కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిన జై భీమ్ భారత్ పార్టీ చీఫ్                                   


ఈ దాడి ఘటనపై సీనియర్ లాయర్, జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రయత్నించారని మండిపడ్డారు. దస్తగిరి పోటీలో నుంచి విరమించుకోకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ హెచ్చరించారన్నారు. దస్తగిరి గత వారం జై భీమ్ రావ్ భారత్ పార్టీలో దస్తగిరి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. దస్తగిరి అభ్యర్థిత్వంపై ఏమీ చేయలేకదస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి చేయటం దారుణమన్నారు.      


జగన్‌పై పోటీ చేయాలనకుంటున్న దస్తగిరి                                                                     


 అవినాశ్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి హస్తం ఉందని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దారుణం జరిగిందని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో త‌న‌కు త‌న కుటుంబ సభ్యులకు తక్షణమే భద్రత కల్పించాల‌ని దస్తగిరి కోరారు.వెంటనే దస్తగిరి కుటుంబ సభ్యులందరికీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనపై 12న సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.