జగనన్న కాలనీల్లో జరుగుతున్న అక్రమాలపై పోరుబాట పట్టిన జనసేనపై వైసీపీ కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. ఈ పోరాటంపై మంత్రి సీదిరి అప్పల రాజు ఘాటుగా స్పందించారు. విజయనగరంలోని గుంకలం గ్రామంలో టిడ్కో ఇళ్ల సందర్శనకు పవన్ వెళ్తాననడం హాస్యాస్పదమని అభిప్రాయపడ్డారు. బుర్ర బుద్ది ఉన్నవారు మాట్లాడే మాటలు కాదన్నారు. ప్యాకేజీ రాజకీయాలకు పవన్ అలవాటు పడిపోయిన వ్యక్తి అంటు సీరియస్ కామెంట్స్ చేశారు. అందుకే ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పవన్ మాటలను మీడియా హైలెట్ చేయడం వల్లనే తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని ఆక్షేపించారు. టిడ్కో ఇళ్లు నిర్మాణం చంద్రబాబు హయంలో జరిగినవని పవన్ గుర్తు పెట్టుకోవాని సూచించారు.
పవన్‌కు బుర్ర, బుద్ధి లేదు- ప్యాకేజీలకు అలవాటు పడ్డారు: మంత్రి సీదిరి అప్పలరాజు
ABP Desam
Updated at:
12 Nov 2022 02:18 PM (IST)
ప్యాకేజీ రాజకీయాలకు పవన్ అలవాటు పడిపోయిన వ్యక్తి అంటు మంత్రి అప్పలరాజు సీరియస్ కామెంట్స్ చేశారు. అందుకే ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
మీడియాతో మాట్లాడుతున్న సీదిరి అప్పలరాజు