Vizianagaram MP Kalisetti Appalanaidu: ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కింజరాపు ఎర్రన్నాయుడు టాప్‌లో ఉంటారు. తెలుగుదేశం పార్టీ తరుపున బలమైన నాయకత్వాన్ని చాటి చెప్పే వ్యక్తిగా, నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా ఎర్రన్నాయుడు ఇటు ప్రజలకు, అటు రాజకీయ ప్రముఖులకు ఎంత సుపరిచితుడు. అలానే కింది స్థాయిని ఎదుగుతున్న మరో వ్యక్తి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగిన ఈ వ్యక్తి రణస్థలం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పయనం సాగించారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో పార్లమెంట్‌కు తొలిసారి వెళ్తూ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. తెలుగుదేశం తరఫున ఎన్నికైన ప్రతి ఎంపీ గుర్తు పెట్టుకునే చేసింది. తొలిసారి సైకిల్ మీద పార్లమెంట్‌కు వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. పసుపు దుస్తుల్లో సైకిల్‌పై వెళ్లాలని తీసుకున్న నిర్ణయం ప్రతి తెలుగు దేశం కార్యకర్త ఉప్పొంగిపోయేలా చేసింది.
ఆ ఒక్క సమావేశానికే కాదు ఆయన ప్రతి సమావేశానికి కూడా ప్రతి రోజూ సైకిల్‌పై వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన పార్లమెంట్‌లో వంద శాతం అటెండెన్స్ ఉన్న ఎంపీ. సైకిల్‌పై వెస్ట్రన్ కోర్టు నుంచి పార్లమెంట్‌కు వెళ్తుంటారు ఈ అప్పలనాయుడు. సమావేశాలు ఉంటే ఢిల్లీలో ఉంటారు. లేకుంటే ప్రజల్లో ఉంటారు. ఆయనకు తెలిసినవి ఈ రెండే అంటున్నారు అనుచరులు. వాస్తవానికి కొత్త పార్లమెంట్లోకి సైకిల్‌తో అప్పలనాయుడు రావడాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన మాత్రం పట్టువీడలేదు.
Also Read: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఒక జర్నలిస్టుగా వచ్చి రాజకీయంలో ఎదుగుతూ కూటమి ప్రభుత్వంలో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. అధిష్టానం దగ్గర మెప్పు కోసం సైకిల్ తొక్కుతూ వినూత్నంగా అందర్నీ ఆకట్టుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. వచ్చిన జీతాన్ని ఎంపీ నిధులతో విజయవాడలో వరద ప్రవాహంతో చిక్కుకున్న వాళ్లకి ఒకసారి అన్నా క్యాంటీన్‌కి మరోసారి ఇచ్చారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్స్ అంటున్నారు.
అప్పలనాయుడు ప్రజల మనిషి అని అందుకే ఇలాంటివి చేస్తుంటాడని అనుచరులు అంటున్నారు. ఈ వాదన ఎలా ఉన్నా పార్లమెంట్‌లో ప్రత్యేకత చాటుకున్న అప్పలనాయుడు గురించి ప్రజలు గొప్పగానే చెప్పుకుంటున్నారు. దీంతోపాటు రణస్థలం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయని వాటిపై కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
Also Read:సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?