Visakha Fishing Harbour Fire Accident: విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఇటీవల అగ్నిప్రమాదం జరిగి బోట్లు కాలి బూడదైన కొన్ని రోజుల్లోనే మరో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. షార్ట్ సార్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కానీ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో వరుస అగ్నిప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.