Visakhapatnam Rayagada Passenger train derailed
విజయనగరం: ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం 7 మంది మృతిచెందగా, పదలు సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504).. పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొట్టినట్లు అధికారులు భావించారు. కానీ సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాసకు వెళ్తున్న రైలును విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 




విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అలమండ - కంటకాపల్లి వద్ద విశాఖ నుంచి పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా కొన్ని బోగీలు పట్టాలు తప్పాయని వాల్తేరు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. రైలు ప్రమాదంలో రైల్వే గ్రూపులో సమాచారం ఇచ్చినట్లు డీఆర్ఎం చెప్పారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాయపడ్డవారిని అంబులెన్స్ లలో విశాఖ, విజయనగరం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. రాత్రివేళ కావడం, చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వైర్లు తెగిపడటంతో ప్రమాదం జరిగిన ప్రాంతం చీకటిగా మారింది.


ఒడిశా రైలు విషాదం తరువాత దేశంలో పలుచోట్ల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల పట్టాలు తప్పడం, కొన్ని సందర్భాలలో సిగ్నలింగ్ సరిగా లేక వేరే రైళ్లను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు.. విశాఖ నుంచి పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. అధికారులు ఈ ప్రమాదంపై అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కానీ చీకటిగా ఉండటంతో పరిస్థితిని సరిగా అంచనా వేయడానికి ఇబ్బంది కలుగుతోంది.


రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి.. 
విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు.. పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిగ్నల్ కోసం వేచిచూస్తున్న సమయంలో ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందన్నారు. నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా అధికారులు సీఎం జగన్ కు వివరించారు. విశాఖ పలాస రైలును.. రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రైలు ప్రమాదంలో బాధితులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 


రైలు ప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ స్ నాగలక్ష్మి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
- బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు
- బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సూచించారు.


రాయగడ ఎస్ ప్రెస్ రైల్ ప్రమాదం ఘటనపై విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే
0891 2746330, 08912744619
ఎయిర్ టెల్
81060 53051
8106053052
బీఎస్ ఎన్ ఎల్ 
8500041670
8500041671