vizag harbour fire incident: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదానికి (Vizag Harbour Fire Accident) కారణాలను నగర సీపీ రవిశంకర్ వెల్లడించారు. సిగరెట్ తాగి పడేయడంతో అగ్ని ప్రమాదం జరిగి 30 బోట్లు కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనకు వాసుపల్లి నాని, అతడి మామ సత్యం కారకులని భావిస్తూ, వారిని ప్రధాన నిందితులుగా తేల్చినట్లు చెప్పారు. ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour )కేసులో ఈ ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మద్యం మత్తులో ఉన్న వారు పక్క బోటు లోకి సిగరెట్ విసిరేయగా, బోటు ఇంజిన్ పై సిగరెట్ పడటంతో పాటు తీవ్ర గాలులు వీచడంతో మంటలు చెలరేగి ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయి రూ.8 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. యూట్యూబర్ నానిని విచారణలో భాగంగా స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించినట్లు సీపీ రవిశంకర్ చెప్పారు. అయితే అంతలోపే నాని ఆందోళనకు గురై కోర్టును ఆశ్రయించాడని స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి యూట్యూబర్ నానికి ఏ సంబంధం లేదని విచారణలో తేలిందన్నారు.
వెంకటేశ్ కు చెందిన బోటులో ఫిష్ ఫ్రై చేసుకున్నారు. ఆపై మద్యం సేవించారు. మత్తులో పక్కనున్న బోటు 815 నెంబర్ బోటు మీదకు సిగరెట్ విసిరేశారు. కానీ ఇంజిన్ మీద సిగరెట్ పడటం, గాలులు వీచడంతో మంటలు చెలరేగి మిగతా బోట్లకు మంటలు అంటుకుని అన్నీ బూడిదయ్యాయని సీపీ తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదానికి లోకల్ బాయ్, యూట్యూబర్ నానియే కారణమని బోటులో అతడు తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలోనూ యూట్యూబర్ నాని అగ్ని ప్రమాదం ఘటనపై వీడియో రికార్డ్ చేస్తూ పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ప్రాథమికంగా యూట్యూబర్ నానిని అనుమానించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసులు తనను అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అతడు భావించాడు. లాయర్ ద్వారా కోర్టులో రిట్ పిటిషన్ వేసి బయటకు వచ్చాడు. పోలీసులు తనను చంపేసేవారంటూ నాని సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు..
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి దర్యాప్తునకు సీసీ ఫుటేజీ కీలకంగా మారింది. దీని ఆధారంగా ప్రమాదం జరిగిన రోజు రాత్రి నవంబర్ 19న 10:48 గంటలకు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు రావడం గుర్తించారు. ఆ తర్వాత 2 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాద జరగడానికి కొంత సమయం ముందు ఇది జరిగింది. ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాదంలో 39 బోట్లు దగ్ధం కాగా, మరికొన్ని బోట్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పోలీసులు వెల్లడించారు. మొదట యూట్యూబర్ నాని కారణమని, ఆపై మందు పార్టీలో ఉప్పుచేప వండుతుండగా ప్రమాదం జరిగిందని భావించారు. కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన విశాఖ పోలీసులు ఈ ప్రమాదానికి కారకులని గుర్తించి, ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వాసుపల్లి నాని, అతడి మామ సత్యం మందు పార్టీ చేసుకున్నారని, ఈ క్రమంలో సిగరెట్ విసిరేయడంతో అది భారీ అగ్నిప్రమాదానికి కారణమైనట్లు వివరించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply