శ్రీకాకుళం: భోగాపురం అంతర్జాతీయ విమాశ్రయం శర వేగంగా నిర్మాణం అవుతోంది. ఇప్పటికే ఎయిర్ పోర్టు పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. మరో ఏడాదిలో మొదటి విమానం దిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఏరియా అంతా ఎలా మారిపోతుందో ఊహించడం కష్టమే. అందుకే ఇప్పుడే చాలా మంది ముందస్తుగా అక్కడ తమకు వీలైనంత భూమి కొనేస్తున్నారు. అవకాశం ఉన్న వారంతా అదే పనిలో ఉండటంతో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది.


భోగాపురం నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్లో విపరీతంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. పెద్దగా రోడ్డు సౌకర్యం లేకపోయినా.. సరే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి భోగాపురం ఎయిర్ పోర్టులో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ ప్రారంభమైతే.. అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అంతకు మించి లగ్జరీ లైఫ్ కోసం బడా నిర్మాణ సంస్థలు సౌకర్యాలు కల్పించేందుకు పరుగులు పెడతాయి. ఇది జరగడానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు. నాలుగైదేళ్ల కాలంలోనే భోగాపురం చుట్టుపక్కల శంషాబాద్ తరహాలో, ఒక సిటీ ఏర్పడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి భోగాపురంలో బడా నిర్మాణ సంస్థలు కూడా, పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశాయి.


గ్రామాల్లో చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న చిన్న వెంచర్లు వేస్తున్నారు. 150 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. గజం ధర రూ.5 నుంచి రూ.30వేల వరకూ దూరాన్ని బట్టి నిర్ణయిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా కొందరు రియల్ఎస్టేట్ యజమానులు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా, గ్రామ పంచాయతీ అనుమతులు ఉండటమో.. అసలు పూర్తిగా అనుమతులు లేకపోవడమో జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అనుమతులు ఇవ్వడం లేదని.. ముందుముందు అనుమతుల బాధ్యత తామే తీసుకుంటామని కొంత మంది భరోసా ఇస్తూంటారు. కానీ ఒకసారి డబ్బులు చేతుల్లో పడ్డ తర్వాత, ఎవరూ బాధ్యత తీసుకోరు. ప్రస్తుతం అమరావతిలో ప్లాట్ల కన్నా.. భోగాపురం ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. అయితే పెట్టే పెట్టుబడికి తగ్గట్లుగా సురక్షితమైన వాటి విషయంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.


భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాదికి ఫ్లైట్ ల్యాండ్ చేస్తామని చెప్పడంతో అక్కడ రేట్లు పెరుగుతున్నాయని మాటేమో కానీ మరోపక్క. భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదంటూ ఓ పక్కన ఆవేదన చెందుతున్నారు. చూస్తే విమానశ్రయం పనులు ఇప్పటికే 60 శాతం పూర్తి అవడంతో మా డబ్బులు మాకు కావాలి అంటూ. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో మేము ఇస్తామని చెప్పి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం చేస్తామన్నారు కానీ ఈరోజు వరకు ఎవరు మాకు అందుబాటులో దొరకట్లేదు. మరో పక్కన చూస్తే విమానశ్రయం పనులు వేగంగా అయిపోతున్నాయి. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఉత్తరాంధ్ర నుంచి కీలక నేతగా మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానాశ్రయ శాఖ మంత్రిగా పదవి ఉన్నప్పటికీ ఆ ప్రాంత యొక్క ప్రజలు సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు అని కొంతమంది స్థానికంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల గ్రామాలైతే మాత్రం హాట్ కేకు లాగా వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్స్ అదేవిధంగా. వేసుకున్న రియల్ ఎస్టేట్ పేపర్ మాత్రం హార్ట్ కేకు లాగా ఉన్నాయని చెప్పేసి మరో పక్క మాకు రావలసిన బకాయిలు పూర్తిస్థాయిలో ఇవ్వకుండా నిర్మాణాలు చేస్తూ మా పొట్టను కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భోగాపురం గ్రామస్తులు.