MLA Velagapudi: ఫిర్యాదు చేసినా, ఏ చర్యలు తీసుకోలేదు- విశాఖ సీపీని కలిసిన ఎమ్మెల్యే వెలగపూడి

TDP MLA Velagapudi: తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి బెదిరింపు ఫోన్లు రావడంతో నగర పోలీస్ కమిషనర్ ని మంగళవారం ఆయన కార్యాలయంలో కలిశారు.

Continues below advertisement

Visakhapatnam News: విశాఖపట్నం: విశాఖలో విష సంస్కృతి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) చలువే అని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు (Velagapudi Ramakrishna Babu)కి బెదిరింపు ఫోన్లు రావడంతో నగర పోలీస్ కమిషనర్ ని మంగళవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి మీడియాతో మాట్లాడతూ.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై సీపీకి తెలియజేయగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. కానీ ఏపీ చరిత్రలో గతంలో లేని విధంగా వైసీసీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో విష సంస్కృతి నెలకొందని విమర్శించారు.

Continues below advertisement

ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రాత్రివేళ వచ్చిన ఇంటర్నేషనల్ కాల్స్ నెంబర్ల తో లిఖితపూర్వకంగా ఈ నెల 26 న ఎమ్ వి పి పి ఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనను చంపేస్తా, నరికేస్తానని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేసినా, ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. కొందరు వ్యక్తులు ఫోన్ చేసి.. ఆయనను చంపేస్తాము, నరికేస్తాము అని దుర్భాషలాడారు. తనకు ఫోన్ చేసిన వ్యక్తులు ఉత్తరాంధ్ర వ్యక్తులు కాదు ఇటువంటి విష సంస్కృతి నేను ఎప్పుడు చూడలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖ జగన్ పాలనలో గంజాయి వనంలా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో విశాఖలో సుమారు 50 హత్యలు జరిగాయని, రౌడి షీటర్లు మరణిస్తే కత్తులు పట్టుకుని ర్యాలీలు చేయడం చూస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


సీఎం జగన్ పాలనలో ప్రజా ప్రతినిధుల కుటుంబానికే రక్షణ లేదంటూ ఎమ్మెల్యే వెలగపూడి మండిపడ్డారు. పోలీస్ కమిషనర్ ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆయన తెలిపారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు లేకపోయినా బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని కమిషనర్ చెప్పారని తెలిపారు. బెదిరింపు ఫోన్ కాల్స్ వంటి విషయాన్ని పార్టీలకు అతీతంగా ఖండిచాలని పిలుపునిచ్చారు. మరో 2 నెలల్లో ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్పుడు చట్టం తన పని తాను చేస్తుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం కుట్ర!
తనకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి తెలిపారు. ఇది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రే అని మరోసారి అన్నారు. వెలగపూడితో పాటు పోలీస్ కమిషనర్ ని కలసిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి, బైరెడ్డి పోతన్న రెడ్డి తదితరులు ఉన్నారు.

Continues below advertisement