Trains Cancelled From Vizag | విశాఖపట్నం రైల్వే ప్రయాణికులకు అలెర్ట్. వైజాగ్ నుంచి బయలుదేరే కొన్ని ముఖ్యమైన  తాత్కాలికంగా రద్దు చేసినట్టు వాల్తేరు డిఆర్ఎం సందీప్ తెలిపారు. తాడి- దువ్వాడ స్టేషన్ల మధ్య  నాన్ -ఇంటర్ లాకింగ్, ట్రాక్ రెన్యూవల్ పనుల కారణంగా కొన్ని ముఖ్యమైన రైళ్ళను కొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు  అధికారులు ప్రకటించారు. 

 రద్దు అయిన రైళ్లు ఇవే 1)  విజయవాడ నుండి విశాఖపట్నం నుంచి వెళ్లే ట్రైన్ నెంబర్  12718 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ ను జూలై 26,28,30 తేదీల్లో రద్దు చేశారు 

2)  విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్లే ట్రైన్ నెంబర్ 12717 ' రత్నాచల్' ఎక్స్ ప్రెస్ ను జూలై 28,28,30 తేదీల్లో రద్దుచేసారు 

3)  విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్లే ట్రైన్ నెంబర్ 22875 'ఉదయ్ ' డబుల్ డెకర్ ఎక్స్ ప్రెస్ ను  జూలై 26 మరియు 30 తేదీల్లో రద్దు చేసారు 

4)  గుంటూరు నుండి విశాఖపట్నం  వెళ్లే ట్రైన్ నెంబర్ 22876 'ఉదయ్ ' డబుల్ డెకర్ ఎక్స్ ప్రెస్ ను  జూలై 26 మరియు 30 తేదీల్లో రద్దు చేసారు 

5)  కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే ట్రైన్ నెంబర్ 17267 మెము ఎక్స్ ప్రెస్ ను  జూలై 26,28,30 తేదీల్లో రద్దు చేసారు.

6)   విశాఖపట్నం నుండి కాకినాడ వెళ్లే ట్రైన్ నెంబర్ 17268 మెము ఎక్స్ ప్రెస్ ను  జూలై 26,28,30 తేదీల్లో రద్దు చేసారు.

7)   రాజమండ్రి నుండి విశాఖపట్నం వెళ్లే ట్రైన్ నెంబర్ 67285 మెము ఎక్స్ ప్రెస్ ను జూలై 26,28,30తేదీల్లో రద్దు చేసారు.

8)     విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్లే ట్రైన్ నెంబర్ 67286 మెము ఎక్స్ ప్రెస్ ను జూలై 26,28,30తేదీల్లో రద్దు చేసారు.

 రైళ్ల వేగం పెంచడం, ట్రాక్ సామర్థ్యం మరింత డెవలప్ చేయడం వంటి పనుల కారణం గా కొన్ని రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేస్తూ వస్తోంది. త్వరలోనే ఈ పనులన్నీ పూర్తయి యధావిధిగా రైళ్లు తిరుగుతాయని  అధికారులు తెలిపారు. వైజాగ్,విజయవాడ, రాజమండ్రి,కాకినాడ ప్రజలు ఈ మార్పులు గమనించాల్సిందిగా వారు కోరారు