Political Face Of Madugula: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం మాడుగుల. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, 4సార్లు కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2,15,571 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,04,981 మంది, మహిళా ఓటర్లు 1,10,584 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లది పైచేయిగా ఉంది.
ఇవీ ఎన్నికల ఫలితాలు
మాడుగుల నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలి ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన బీజీ నాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఐ.సత్యనారాయణపై 3,226 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన డీఎస్ మూర్తి తన సమీప ప్రత్యర్థి ప్రజా పార్టీ నుంచి పోటీ చేసిన టి.విశ్వనాథంపై 4,858 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తెన్నేటి విశ్వనాథం విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీఎస్ మూర్తిపై 18,006 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇదే ఏడాది ఈ నియోజకవర్గాన్ని రెండుగా చేశారు. బొడ్డం పేరుతో ఏర్పాటైన నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏ.దశావతారం విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన జీబీ అప్పారావుపై 228 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దేవి రమా కుమారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎస్ భూమిరెడ్డిపై 20,257 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కళావతి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎస్ భూమిరెడ్డిపై 5344 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె రామునాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జి ఆదినారాయణపై 437 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణ ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి డీఎన్ బొడ్డుపై 16,882 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు.
1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణ మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె రామునాయుడపై 28,421 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి రెడ్డి సత్యనారాయణ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె రామునాయుడుపై 10,084 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణ వరుసగా నాలుగోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేఎస్ అప్పారావుపై 27,091 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డి కన్నబాబుపై 5831 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కరణం ధర్మ శ్రీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణపై 8737 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన జి రామానాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఏ రామూర్తి నాయుడు 6827 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బి ముత్యాలనాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జి రామానాయుడిపై 4761 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బి ముత్యాల నాయుడు మరోసారి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన జి రామానాయుడుపై 16,392 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి మూడి ముత్యాల నాయుడు వైసీపీ రెండో విడత మంత్రివర్గంలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. టీడీపీ నుంచి జి రామానాయుడితోపాటు మరో నేత కూడా ప్రయత్నిస్తున్నారు. జనసేన కూడా ఇక్కడి నుంచి సీటు ఆశిస్తోంది. చూడాలి మరి కూటమి అభ్యర్థిగా ఎవరు దిగుతారన్న దానిని బట్టి పోటీ ఉండనుంది.