AP Model School Admissions: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడింది. విద్యార్థులు మార్చి 1 నుండి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధిస్తారు, చదువుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. ఈ పాఠశాలలన్నీ కూడా సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి.


ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 1 నుంచి31 వరకు నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కేటాయించిన జనరల్ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్ నెట్ కేంద్రంలో www.cse.ap.gov.in లేదా apms.ap.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* ఆదర్శపాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలు


అర్హతలు: విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలు చదివి ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.


వయోపరిమితి: ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 5వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో అర్హత మార్కులకు ఓసీ, బీసీ విద్యార్థులకు 35గా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30గా నిర్ణయించారు.


ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజుచెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.03.2024.


➥ పరీక్ష తేదీ: 21.04.2024 (ఆదివారం).


పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు.


పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.


Website



ALSO READ:


ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్‌-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
పాలిసెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..