Union Ministers Convoy Accident: విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం- దెబ్బతిన్న 3 వాహనాలు

Visakha Steel Plant పరిశీలనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి స్టీల్ ప్లాంట్‌కు వెళ్తుంటే కాన్వాయ్ లో వాహనాలు ఢీకొన్నాయి.

Continues below advertisement

Vizag Steel Plant News | విశాఖపట్నం: విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమార్ స్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. షీలా నగర్ వద్ద మంత్రుల కాన్వాయ్ లోని మూడు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. మొత్తం 8  వాహనాల కాన్వాయ్ లో 3 కార్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగి మూడు కార్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ధ్వంసమైన కార్లలో మాజీ ఎంపీ జీవీఏల్ కార్ కూడా ఉందని సమాచారం. 

Continues below advertisement

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు  రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన కుమారస్వామి, శ్రీనివాసవర్మ అక్కడి యాజమాన్యంతో పాటు ఉద్యోగులు, కార్మికులతో సమావేశం అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా స్టీల్‌ప్లాంట్‌ను డెవలప్ చేయడంపై వారితో చర్చించి వివరాలు నోట్ చేసుకుంటారు. 

అంతకుముందు గురువారం కేంద్ర మంత్రి కుమారస్వామి ఎయిర్‌పోర్టుకు చేరుకోగా ఎంపీ సీఎం రమేశ్‌, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని హిల్‌టాప్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి కేంద్రమంత్రులు స్టీల్ ప్లాంట్‌కు వెళ్తుండగా షీలానగర్‌ వద్ద కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు తెలిపారు.

Continues below advertisement