ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు దండుపాళ్యం బ్యాచ్‌కు పెద్ద తేడా లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్లపై మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసారు. 


 


హత్యకు గురైన ఫ్యామిలీని పరామర్శించిన సందర్భంగా పవన్ ఎమోషన్ అయ్యారు.  








హత్యకు గురైన మహిళ ఫ్యామిలీని పరామర్శించిన పవన్‌తో ఆరోజు జరిగిన ఉదంతాన్ని వివరించారు. అతి కిరాతకంగా హత్య చేశాడని వివరించి చెబుతుంటే పవన్ ఎమోషన్ అయ్యారు. ఇంత కిరాతకంగా ఎలా చేస్తారని అన్నారు.



పరామర్శ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్... వారాహి యాత్రకు విధించిన ఆంక్షలు వాలంటీర్‌లకు విధించి ఉంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరిగేవి కావన్నారు పవన్. మహిళను వాలంటీర్ అత్యంత దారుణంగా హత్య చేశారని అన్నారు. బంగారు నగల కోసం పిడిగుద్దులతో చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం తరఫున కానీ, వైసీపీ నుంచి కాని ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీని పరామర్శించలేదని ఆవేదన చెందారు. 


రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌పై తాను చేసిన ఆరోపణలకు పక్కా ఆధారాలు ఉన్నాయని అన్నారు పవన్. ఈ మధ్య కాలంలో సభలోనే కేంద్రం ఆలెక్కలు వెల్లడించిందని అన్నారు. ఒక్క విశాక నుంచే 150కిపైగా చిన్నపిల్లలు అదృశ్యమయ్యారని గుర్తు చేసారు. 


వారాహి యాత్రపై పెట్టిన ఆంక్షలు వాలంటీర్‌లపై పెట్టి ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. అయితే ఆంక్షలు మాత్రం జనసేనకు,పవన్ కల్యాణ్‌కే ఉంటాయని వేరే వాళ్లకు ఉండవని ఎద్దేవా చేశారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారని వాలంటీర్ ఉద్యోగానికి అవేమీ అవసరం లేదా అని ప్రశ్నించారు.