Vizag News: సీఎం కాపురానికి వచ్చింది లేదు, మళ్లీ గెలిచేది లేదు - గంటా ఎద్దేవా

Vizag News: ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామనే సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు..? అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

Continues below advertisement

Ganta Srinivasa Rao comments on CM Jagan: ‘‘నెలలో వస్తా... సంక్రాంతి కి వస్తా... ఉగాది కి వస్తా... ఆ ఐదేళ్ళ అంకం ముగిసింది... మీరు కాపురానికి వచ్చింది లేదు.. రేపు మీరు గెలిచేది లేదు... ప్రమాణ స్వీకారానికి వచ్చేది లేదు...’’ అని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నం ఉంటే దాన్ని సిటీ ఆఫ్ డేంజర్ గా మార్చేశారని విమర్శించారు. విశాఖపట్నానికి ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని.. ఇప్పుడు కొత్తగా ఇక్కడికి పరిశ్రమలు తెస్తామని ఊదరగొడుతున్నారని ఆరోపించారు.

Continues below advertisement

"City of Destiny" గా ఉన్న విశాఖను మీరొచ్చాక "City of Danger " గా మార్చేశారు. ప్రశాంత విశాఖకు రాజధాని పేరుతో.. రౌడీల రాజ్యం తెచ్చేశారు. రణరంగ క్షేత్రాన్ని సృష్టించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామనే సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు..? మీరు రాకముందు వరకు విశాఖ నగరం అభివృద్ధిలో దూసుకెళ్ళింది. మీరొచ్చాకే అభివృద్ధి కుంటుపడిందనేది జగమెరిగిన సత్యం.

విశాఖలో ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి.. ఇప్పుడేమో విశాఖలో ఉద్యోగులను కల్పిస్తామని ఊదరకొడుతున్నారు. అందుకే విశాఖ ప్రజలంతా ముక్తకంఠంతో "రావద్దు జగన్.. మాకొద్దు జగన్" అంటూ స్వరం పెంచారు! మీ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరు. ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కాదు. విశాఖ నుంచే మీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖ గురించి జగన్ కామెంట్స్ ఇవీ
విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైజాగ్‌ నుంచే పాలన చేపడతామన్నారు. మళ్లీ గెచిన తర్వాత వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అదే తన కమిట్‌మెంట్‌ అంటూ కామెంట్ చేశారు. 

విశాఖలో విజన్ విశాఖ సదస్సు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఓప్రైవేటు హోటల్‌లో రెండు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ వైజాగ్‌ వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే వైజాగ్‌ చాలా త్వరగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు జగన్. స్థిరత్వమైన ప్రభుత్వం ఉందని అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. అదే టైంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. రాష్ట్రానికి విశాఖ చాలా ముఖ్యమైన బ్యాక్ బోన్‌గా ఉండబోతోందని అన్నారు. 

భవిష్యత్‌లో హైదరాబాద్‌ కంటే వైజాగ్ అభివడద్ధి చెందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. విభజనలో భాగంగా హైదరాబాద్ కోల్పోయామని దాని ప్రభావం నేటికీ ఉంటోందన్నారు. ఓవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని కూడా ఉరకలు పెట్టిస్తున్నామన్నారు. ప్రస్తుతం  వ్యవసాయం ఏపీలో 70 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.

Continues below advertisement