Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో పుట్టిన రోజు వేడుకులకు వెళ్తున్న కారు టూ వీలర్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లో చనిపోయారు.
పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు విశాఖపట్నం బయల్దేరారు. పుట్టిన రోజు వేడుకుల కకోసం ఆనందంగా వెళ్తున్న వారి జీవితాల్లో విషాదం నెలకొంది. వారు ప్రయాణిస్తున్న కారు టూ వీలర్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో టూవీలర్‌పై వెళ్తున్న ఇద్దిరితోపాటు కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో దువ్వారి మీనమ్మ, భాస్కరరావు , లక్మీపతి మృతి చెందారు. కాలిదాసు, కుసుమ అనే ఇద్దరు గాయాలు పాలయ్యారు. వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన తెలియడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.