Falaknuma Superfast Express Train | పలాస: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. 12704 ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. కప్లింగ్ వీడి రైలు రెండు భాగాలుగా విడిపోయింది. పలాస సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరుగుతుంతో అర్థంకాక ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సికింద్రాబాద్ నుండి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ కప్లింగ్ వీడి రైలు రెండు భాగాలు అవడంతో పలు ట్రైన్లు ఆలస్యం అయ్యాయి. పలాస- మందస మధ్య ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. దాంతో రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు.
Train Incident: రెండు భాగాలుగా విడిపోయిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు, తప్పిన పెనుప్రమాదం
Shankar Dukanam | 08 Apr 2025 10:29 AM (IST)
Train Incident: రెండు భాగాలుగా విడిపోయిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు, తప్పిన పెనుప్రమాదం