విజయనగరం జిల్లాలోని కొత్త వలస మండలం కంటాకపల్లిలో జరిగిన రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సీఎం జగన్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆ వెంటనే అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు.


తొలుత సీఎం జగన్ రైలు ప్రమాదం జరిగిన చోటును పరిశీలించాలని అనుకున్నారు. కానీ, రైలు అధికారుల సూచనతో దాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్, విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చెల్లా చెదురుగా పడిపోయిన బోగీలను తొలగిస్తున్నారు. సీఎం ఆ ప్రదేశానికి వెళ్తే పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే రైల్వే అధికారుల విజ్ఞప్తితో ఘటనా స్థలానికి గవెళ్లకుండా నేరుగా బాధితుల్ని పరామర్శించారు.​ ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైనin  బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు.






‘‘విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.