Visakhapatnam CII Partnership Summit: విశాఖలో జరుగుతున్న 30 సీఐఐ భాగస్వామ్య సదస్సు కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ అనంతపురంలో రేమాండ్ ప్రాజెక్టులకు పునాది రాయి పడింది.విశాఖ- 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా

Continues below advertisement

శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ భరత్

రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయననుంది.సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.

మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమాండ్ సంస్థ. మేరకు ప్రభుత్వంతో ఒప్పందం జరగడమే కాకుండా పనులకు శంకుస్థాపన కూడా చేసుకున్నారు.

Continues below advertisement

ముఖ్యమంత్రి ఇవాళ్టి షెడ్యూల్ ఇదే 

30వ సిఐఐ సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబుతో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశమవుతున్నారు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు, ప్రతినిధులతో భేటీ జరగనుంది.  శ్రీసిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు గురించి వాళ్లకు వివరిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ సెషన్లలో సీఎం పాల్గొంటారు. ఆయా రంగాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు గురించి తెలియజేస్తారు. సీఎం చంద్రబాబు సమక్షంలో కంపెనీలు పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నాయి.