APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

APSRTC బస్సును దొంగిలించిన ఆగంతుకుడు రేగిడి మండలం మీసాల డోలపేట కందిశ గ్రామాల మధ్యలో బస్ ను నిలిపివేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

Continues below advertisement

Vizianagaram APSRTC Bus Theft: విజయనగరంలో ఆర్టీసీ బస్సు దొంగతనం కలకలం రేపింది. విజయనగరం జిల్లాలోని వంగరలో (Vangara Bus Theft) ఈ ఘటన జరిగింది. వంగరకు ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన ఓ నైట్ హాల్ట్ ఆర్టీసీ రాగా, ఆ బస్సు ఉదయానికి మాయం (APSRTC Bus Theft) అయింది. దీంతో బస్సు కనిపించకపోవడానికి గుర్తించిన డ్రైవర్ పీల బుజ్జి వెంటనే పోలీసులకు, ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బస్సులో ఉన్న జీపీఎస్ (GPS) వ్యవస్థ పని చేయకపోవడంపై పోలీసులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బస్సు మాయం (Bus Theft) అయిన ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాలు అయిన వంగర, అరసాడ లలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పర్యవేక్షించారు. బస్సు ఆచూకీ కనిపెడుతున్న సమయంలో అనూహ్యంగా బస్సు ఎక్కడుందో ఆధారం దొరికింది.

Continues below advertisement

ఆర్టీసీ బస్ (APSRTC Bus) ఆచూకీ లభ్యం
పల్లె వెలుగు బస్సును (Palle Velugu Bus Theft) దొంగిలించిన ఆగంతుకుడు రేగిడి మండలం మీసాల డోలపేట కందిశ గ్రామాల మధ్యలో బస్ ను నిలిపివేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రేగిడి ఆమదాలవలస మండలం (Amadala Valasa Mandal) మీసాల డోలపేట దగ్గర గుర్తించామని ఆర్టీసీ డీఎం వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే, బస్సును దొంగిలించిన ఆగంతుకుడు మాత్రం పట్టుబడలేదు. అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతని కోసం వెతుకుతున్నామని, అందుకోసం సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

మద్యం లారీ బోల్తా
విజయనగరం జిల్లా (Vizianagaram District News) చీపురుపల్లి నియోజకవర్గం వీపీ రేగ జంక్షన్  దగ్గరలో ప్రభుత్వ మద్యం తరలిస్తున్న వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సగానికి పైగా మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. కొంత మంది మద్యం ప్రియులు సంఘటనా స్థలానికి చేరుకొని మిగిలిన బాటిళ్లను దోచుకున్నారు.. మద్యం వ్యాన్ బోల్తా (Liquor Van Accident) పడడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

ఐదు రూపాయల (5 Rupees Coin) మింగిన బాలుడు
మరోవైపు, తెర్లాం మండలం ఉద్దవోలులో బాలుడు ఐదు రూపాయల కాయిన్ మింగి తల్లిదండ్రులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల కాయిన్ (5 Rupees Coin) మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో విలవిల్లాడిపోయాడు. బాగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో తల్లిదండ్రులు రాజాం పట్టణంలోని (Hospitals in Rajam) ఆరోగ్య హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే తీయించి అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపి విధానం ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న కాయిన్ ను జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

విజయనగరంలో ఆదివాసీల నిరసన

విజయనగరం జిల్లాలో ఆదివాసీ దినోత్సవం నాడు గిరిజనులు వినూత్న నిరసన తెలిపారు. శృంగవరపు కోట మండలంలోని గిరిజన గ్రామాలయిన దారపర్తి పంచాయతీ, బొడ్డవర పంచాయితీ గ్రామాలలో సుమారుగా 4 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఐటీడీఏ నుంచి లోన్లు, భూ అభివృద్ధి పథకాల కోసం కొన్ని సబ్సిడీలు, ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఐటీడీఏ నుంచి పాస్, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు, విద్యార్థుల యొక్క సర్టిఫికెట్ సమస్యలు, ఎస్టీ కోటలో విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపులు, వారి స్కాలర్షిప్స్ తదితర టెక్నికల్ సమస్యలు తదితర అంశాలపై నిరసన చేశారు. ఈ సమస్యలన్ని జిల్లా మంత్రి, కలెక్టర్ పరిష్కరించే విధంగా చేయాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement
Sponsored Links by Taboola