AP Minister Atchannaidu | కింజరాపు అచ్చెన్నాయుడు.. అన్నచాటు (కింజరాపు ఎర్రన్నాయుడు) తమ్ముడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి క్రమంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమను నమ్మిన వారికి అండగా ఉంటారని కింజరాపు కుటుంబానికి పేరుంది. అందుకు తగినట్లే నాయకులు, కార్యకర్తలకు అచ్చెన్నాయుడు అండగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొత్తమ్మ తల్లి పండుగను రాష్ట్రస్థాయి ఉత్సవంగా నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అచ్చెన్న పనితీరుకు నిదర్శనం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోటబొమ్మాళి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్తమ్మతల్లి ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి అచ్చెన్న సక్సెస్ అయ్యారు.
రాష్ట్ర ఉత్సవంగా కొత్తమ్మవారి పండుగ
హరిశ్చంద్రపురం,టెక్కలి నియోజకవర్గాల నుంచి మూడు సార్లుచొప్పున గెలిచిన అచ్చెన్నాయుడు నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని కోటబొమ్మాళిలో గలకొత్తమ్మతల్లి పండుగకు ఉత్తరాంధ్ర నుంచే కాదు, పొరుగున గల ఒడిశాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. దాంతో ఈ పండుగను రాష్ట్రస్థాయి పండుగగా నిర్వహించేందుకు మంత్రి అచ్చెన్న కృషి చేశారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి వార్షిక ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంరూ.1 కోటి మంజూరు చేసింది. ఈ ఉత్సవంలో పట్టు వస్త్రాలను అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం నుంచి సమర్పిస్తారు. ఉత్సవం సందర్భంగా వివిధ శాఖలతోసమన్వయం చేసుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యతను కలెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించింది.
కొత్తమ్మతల్లి పండుగను రాష్ట్రస్థాయి ఉత్సవంలా నిర్వహించేలా ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేయించడంలో అచ్చెన్నాయుడి చిత్తశుద్ధి నిరూపితమైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒక్క పండుగ నిర్వహణలోనే కాదు, పార్టీ శ్రేణులకు అండగా ఉండడంలో కూడా అచ్చెన్న ముందుంటారని అన్నారు. వైకాపా అధికారంలో ఉన్నపుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన కక్షసాధింపు చర్యలపై పోరాటం చేశారు. అక్రమ కేసులతో వేధించినా తట్టుకుని నిలబడ్డారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పార్టీ శ్రేణులకు అచ్చెన్న ధైర్యం చెప్పారు. అండగా ఉన్నానని హామీ ఇచ్చారు. వైకాపా బాధితులకు సైతం చేయూత నిచ్చారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అంటే చాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిస్సా నుంచి ఎంతో మంది భక్తులు దర్శనానికి వస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఎంతగానో నమ్ముతారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన ముందుగా ఆ దేవాలయం దర్శనం చేసుకుని కింజరాపు ఫ్యామిలీ బయలుదేరుతారు. ఈసారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని. ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు మంజూరు చేయించడంతో స్థానికంగా ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది.
జిల్లాలో అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఒకటో తేదీ నుంచి 3వ తేదీ వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయం తరువాత టెక్కలి నియోజకవర్గంలో మరోసారి అచ్చెన్నాయుడు మార్క్ కనిపిస్తోందని స్థానికంగా చెబుతున్నారు. మొదటిగా అమ్మవారి దగ్గర నుంచే ఏదైనా ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజులు పాటు సంబరాలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు