AP DCM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవల తెలుసుకొని ఇంకా పరిష్కారం కాని సమస్య గురించి తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరికొత్త కార్యక్రమం చేపట్టారు. మామూర పల్లెల్లో ఉన్న థియేటర్లను వేదికగా చేసుకొని ప్రజలతో ముఖాముఖిగా ప్రసంగిస్తున్నారు. మొదట శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో ముచ్చటించారు.
రావివలసలో ఉన్న భవానీ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ప్రజలతో ముచ్చటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. సక్రమంగా పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఇంకా వారికి ఉన్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు చెప్పిన సమస్యలను తెలుసుకున్న పవన్ వాటి పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.