Taramandal Technologies: విశాఖకు చెందిన తారమండల్ టెక్నాలజీస్ స్పెస్ టెక్ రంగంలో ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తుందని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. తాజాగా రిలీజ్ చేసిన డి గ్లోబలిస్ట్ లిస్టులో టాప్ 200 స్టార్టప్ జాబితాలో తారమండల్ టెక్నాలజీస్‌కు చోటు కల్పించింది. గ్లోబల్ బిజినెస్ పొటెన్షియల్, ఇన్నోవేషన్, విస్తరణ ప్రణాళికలను గుర్తించి జాబితాలో చోటు కల్పించింది. ఫోర్బ్స్ ఇండియా ఎలైట్ గ్లోబలిస్ట్ జాబితాలో చోటు అంత సామాన్యంగా దక్కదు. కొన్ని వేల స్టార్టప్‌లు తమ ప్రణాళక్ని ఆశయాలను..స్టార్టప్ పురోగతిని వివరిస్తూ నామినేషన్లు పంపిస్తారు. అందులోనుంచి కొన్నింటిని ఎంపిక చేస్తారు. అలా ఫోర్బ్స్ కు వచ్చిన కొన్ని వేల నామినేషన్ల నుంచి తారమండల్ టెక్నాలజీస్ ఎంపిక అయింది. 


ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోర్బ్స్ డి గ్లోబలిస్ట్ జాబితాలో చోటు దక్కించుకున్న స్టార్టప్ తారమడంల్ టెక్నాలజీస్ ఒక్కటే. అంతే కాదు మొత్తం జాబితాలో స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ఏకైక స్టార్టప్ కూడా తారమండల్ టెక్నాలసీస్‌నే. ఈ నామిషన్ల పరిశీలనకు ఫోర్బ్స్ ఇండియా విభిన్నరంగాల ప్రముఖులతో ఓ కమిటీని నియమిస్తుంది. వారు ఈ స్టార్టప్‌లు ఆయా రంగాల్లో చేస్తున్న కృషిని ఎసెస్ చేస్తారు. తారమండల్ బృందం చేస్తున్న కృషిని ఫోర్బ్స్ ఇండియా ప్రశంసించింది. భవిష్యత్‌లో ప్రపంచ స్పేస్ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్ర వేస్తారని అంచనా వేసింది.


ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకోవడం.. తమకు గౌరవం కల్పించడంతో పాటు మరింత గౌరవం పెంచిందని తారమండల్ టెక్నాలజీస్‌కు చెందిన విలీన్ జడ్సన్ అంటున్నారు. తమ స్టార్టప్ సస్టెయినబుల్ శాటిలైట్ టెక్నాలజీ మీద పని చేస్తోంది.. నెట్ జీరో ఆర్బిట్స్ టార్గెట్ సాధించాలనుకుంటున్నామని చెబుతున్నారు. స్పేస్ డెబ్రిస్‌ను తొలగించే మిషన్‌లో తాము మెరుగైన పాత్ర పోషిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


స్పెస్ మిషన్స్ లో భవిష్యత్ కు ఉపయోగడే ఎన్నో రకాల సొల్యూషన్స్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వినీల్ జడ్సన్ అంటున్నారు. ఇది తమ కంపెనీకి ఓ మైల్ స్టోన్ మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్‌కు కూడా గర్వకారణం అన్నారు. మేక్ ఇన్ వైజాగ్ ఫర్ ది వరల్డ్ అనేలా తమ స్టార్టప్ ఉంటుందన్నారు. ఫోర్బ్స్ ఇచ్చిన గుర్తింపుతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందు ముందు మరిన్ని అంతర్జాతీయ కంపెనీలతో కొలాబరేట్ అయ్యేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీస్‌కు ఆంద్రప్రదేశ్‌ను ఓ హబ్‌గా చేయాలని అనుకుంటున్నామని.. విశాఖ కేంద్రం నుంచే గ్లోబల్ల టాలెంట్‌ను ఇన్వెస్ట్ మెంట్‌ను ఆకర్షిస్తామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


తారమండల్ టెక్నాలజీస్‌కు ఫోర్బ్స్ గుర్తింపు రావడం భారత టెక్నాలజిల్, ఇండస్ట్రియల్ ల్యాండ్ స్కేప్ ఏపీ  ప్రజెన్స్‌ను మరింత పెంచుతుందని వినీల్ చెబుతున్నారు. ప్రస్తుత గుర్తింపుతో తారమండల్ టెక్నాలజీస్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినట్లే. తారమండల్ టెక్నాలజీస్‌ను ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు 2023లోనే ప్రారంభించారు. వినీల్ జడ్సన్ సీఈవో, ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు.  డాక్టర్ రాజేష్, రామరాజ్యలక్ష్మి, గౌతం, నీలకంటేశ్వరరెడ్డి టీమ్‌గా మారి.. స్పేస్ టెక్నాలజీతో పని చేస్తున్నారు. ఏయూ యీనివర్శిటీ ప్రొఫెసర్ మల్లిఖార్జున రావు మెంటార్ గా ఉంటున్నారు. శాటిలైట్ టెక్నాలజీలో అత్యున్నత సాంకేతికతను అభివృద్ది చేసే విషయంలోతమకు హద్దులు ఉండవని ఈ టీం నమ్మకంతో ఉంది.