Andhra Pradesh Electricity Bill Payment : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లుల చెల్లింపు మరింత సులభం కానుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ అందులో కొన్నిసార్లు తప్పుడు సర్వీస్ నెంబర్‌లు తప్పుగా కొట్టిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి ఫిర్యాదులు చాలానే విద్యుత్ అధికారులు వస్తున్నాయి. ఇకపై అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు బిల్లుపైనే క్యూఆర్‌కోడ్‌ను ముద్రిస్తున్నారు.  దాన్ని స్కాన్ చేసి మీరు బిల్ చెల్లించవచ్చు. 

ఒకప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించాలంటే చాలా పెద్ద తతంగం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరింత కష్టం. ఒకరోజు విద్యుత్ అధికారులు వచ్చి బిల్లు డబ్బులు కలెక్ట్ చేసుకునే వాళ్లు. వారి వద్దకు వెళ్లి బిల్లులు చెల్లించి రసీదు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థ వచ్చిందే అప్పటి నుంచి చెల్లింపుల రూపురేఖలే మారిపోయాయి. యూపీఐ చెల్లింపు రావడంతో ఇది మరింత ఈజీ అయ్యింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఇప్పుడు బిల్లులపై క్యూఆర్‌ కోడ్‌లు స్కాన్ చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో చెల్లించేటప్పుడు సర్వీస్‌నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ నెంబర్ ఇచ్చేక్రమంలో ఒక అంకె తప్పుగా టైప్ చేసినా బిల్లు వేరే వాళ్లకు వెళ్లడమో లేదా రిజెక్ట్ కావడమో జరుగుతుంది. ఇలాంటివి నిత్యం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కొన్నిసార్లు సర్వర్ పని చేయకపోయినా ఆ సర్వే నెంబర్‌ మీకు చూపించదు. బిల్లు చెల్లించేందుకు కూడా వీలు పడదు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఏపీఈపీడీసీఎల్‌ ఈ క్యూఆర్‌ కోడ్‌ విధానం తీసుకొచ్చింది. 

క్యూఆర్‌కోడ్‌తో బిల్లు ఎలా చెల్లించాలి?విద్యుత్ సిబ్బంది మీకు బిల్లు ఇచ్చే క్రమంలో అందులో క్యూఆర్‌కోడ్ ఉంటుంది. ఇది ఏ యూపీఐ యాప్‌ ద్వారా అయినా స్కాన్ చేయవచ్చును. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం ఇలా ఏ పేమెంట్‌గేట్‌వే ద్వారా అయినా మీరు బిల్లు చెల్లించ వచ్చు. దీనికి మీరు కొన్ని స్టెప్స్‌ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.  

  • స్పెట్‌-1- ముందుగా బిల్లుపై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయాలి.
  • స్పెట్‌-2 మీ ఫోన్ పే, పేటీఎం, గూగుల్‌పేలో స్కానర్ ఆప్షన్ ద్వారా క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయాలి. షాపుల్లో, వేరే ప్రాంతాల్లో చెల్లింపులకు చేసినట్టుగానే స్కాన్ చేయాలి. 
  • స్పెట్‌-3 అలా స్కాన్ చేసిన తర్వాత మీ పేరు, మీ సర్వీస్ నెంబర్‌తోపాటు ఎంత చెల్లించాలో కూడా చూపిస్తుంది. 
  • స్పెట్‌-4 పే బటన్ ప్రెస్ చేసి మీరు చెల్లింపుల చేయాల్సి ఉంటుంది

వాట్సాప్‌ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చుఆంధ్రప్రదేశ్ ప్రవేశ పెట్టిన మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా కూడా మీరు మీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. దీని కోసం ముందుగా 95523 00009ను సేవ్ చేసి పెట్టుకోవాలి. అనంతరం ఆ నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం మీకు సేవలకు సంబంధించిన మెనూ వస్తుంది. అందులో సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వేరే విండో ఓపెన్ అవుతుంది. అందులో కూడా సేవలను ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు అన్నదాత సుఖీభవ నుంచి 25 విభాగాలు కనిపిస్తాయి. అందులో ఎనర్జీ సేవలు అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. ఆ విభాగంపై క్లిక్ చేస్తే మీ సర్వీస్ నెంబర్ టైప్ చేసి బిల్లు చెల్లించవచ్చు.