Pawan Kalyan In Visakhapatnam | విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం రుషికొండలో నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మాజీ సీఎం జగన్ నివాసం ఉండడానికి ఈ ప్యాలెస్ లాంటి నిర్మాణాలు కట్టారని, లోపల పెచ్చులు ఉడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతుందని కీలక విషయాలు వెల్లడించారు. రుషికొండపై వైసీపీ హయాంలో 7 బ్లాక్ లకి 4 మాత్రమే కట్టారని, 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో కూటమి అధికారంలోకి తొలి రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రుషికొండలో వైసీపీ హయాంలో జరిగిన నిర్మాణాలను పరిశీలించడం తెలిసిందే.
విశాఖ వేదికగా జనసేన సమావేశాలు.. రుషింకొండను పరిశీలించిన డిప్యూటీ సీఎం
జనసేన విస్తృతస్థాయి సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండ మీద నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గతంలో అవి నిర్మిస్తున్న సమయంలో వైసీపీ నేతలు మమ్మల్ని అందులోకి రానివ్వలేదు... ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తుచేసుకున్నారు. నిర్మాణాలలో రెండు బ్లాక్ లకి మాత్రమే 90 కోట్లు ఖర్చు చేశారు. ఒకదానికి 70 కోట్లు ఖర్చు చేశారు. మరో బ్లాక్ రూ.20 కోట్లతో కట్టారు. కానీ ఏడు బ్లాకులు కట్టాల్సి ఉండగా నాలుగు మాత్రమే పూర్తి చేశారు. కానీ 4 బ్లాకులకే ఏకంగా రూ.454 కోట్లు ఖర్చుచేయడంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గతంలో భారీగా ఆదాయం.. ఇప్పుడు భారీ ఖర్చు..
గతంలో రుషికొండ మీద రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం సంవత్సరానికి కేవలం కరెంట్ బిల్లులకు 15 లక్షలు ఖర్చు, ఏడాదికి రూ.1.8 కోట్లు వ్యయం అవుతుందన్నారు. మిగతా విషయాలపై ఇంకా మాట్లాడనవసరం లేదని, ఇదివరకే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రుషికొండలోని ఈ నిర్మాణాలను టూరిజం కింద ఎలా వినియోగించాలని ఇలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని దేనికోసం, ఎలా ఉపయోగించాలి అని ఆలోచన చేస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్.
రుషికొండలో నిర్మించిన టూరిజం భవనాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
లోపల పెచ్చులు ఉడిపోతున్నాయని చూపిస్తున్న పవన్ కళ్యాణ్