Navy Marathon: రెండేళ్ల గ్యాప్ తర్వాత విశాఖలో నేవీ మారథాన్ ఘనంగా జరిగింది. వైజాగ్ ఆర్కే బీచ్ లోని కాళీమాత టెంపుల్ నుండి ప్రారంభమైన ఈ నేవీ మారథాన్4 కేటగిరీల్లో జరిగింది. 42 కీమీ ల మారథాన్ ను ఫుల్ మారథాన్ గా ఏర్పాటు చేసిన నిర్వాహకులు 21 కీమీ పరుగును హాఫ్ మారథాన్ గా జరిపించారు. ఇవి కాక, 10కే, 5కే అంటూ మరో రెండు కేతగిరీలు కూడా మారథాన్ లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 18000  మంది విశాఖ వాసులు పాల్గొన్నారు. ఈ మారథాన్ ను సినీ నటులు అడివి శేష్, మిళింద్ సోమన్ లు ఆర్కే బీచ్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటుడు అడివి శేష్ మాట్లాడుతూ.. తాను హీరో కాక ముందు ఎక్కువగా  గడిపింది విశాఖలోనే అని తెలిపారు. ఆనాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తువచ్చాయన్న ఆయన మారథాన్ లో పాల్గొన్న వారే నిజమైన హీరోలు ఆన్నారు. 


అలాగే వైజాగ్ అంటే తనకెంతో ప్రేమ అనీ... తన లేటెస్ట్ సినిమా HIT-2 ఎక్కువగా వైజాగ్ పరిసర ప్రాంతాల్లోని షూటింగ్ జరుపుకుంది అని చెప్పారు. ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ మారథాన్ జరగుతుండడం తో వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా యువతీ యువకులు భారీ సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ లోని విశ్వప్రియ హాల్ నుండి భీమిలి వరకూ సాగిన ఈ మారథాన్ లో 42 కీమీ పరుగు ఉదయం 4:15 కి మొదలవగా... చివరిదైన 5 కీమీ మారథాన్ 6:45 కి మొదలైంది. మారథాన్ ముగిసాక విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.


గతంలో నేవీతో పాటు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న సల్లూ భాయ్


సంబరాల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నేవీ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. మూవీ షూటింగ్‌లతో బిజిబిజీగా ఉన్న సల్లూభాయ్.. తన షూటింగ్ లకు విరామం ఇచ్చి ఇండిపెండెన్స్ డే సంబరాల్లో పాల్గొన్నారు. నేవీ సైనికులతో ఒక రోజంతా గడిపారు సల్మాన్ ఖాన్. భారత నౌకా దళ ఈస్ట్ కమాండ్‌కు ప్రధాన స్థావరమైన వైజాగ్‌లో నేవీ సిబ్బందితో సరదాగా గడిపారు. 


వంటవార్పు, పాటలకు డ్యాన్స్ లు


భారీ భారతీయ జాతీయ పతాకాన్ని ఊపుతూ వేడుకలను ఆరంభించారు సల్మాన్ ఖాన్. తర్వాత సంబరాల్లో భాగంగా నేవీ సిబ్బందితో కలిసి పలు పాటలకు డ్యాన్స్ చేశారు. భారత నావికా సిబ్బందితో కలిసి పుష్-అప్ లు కూడా చేశారు. తర్వాత నేవీ కార్యాలయంలోని చపాతీ మేకర్ వద్ద చపాతీలు కాల్చారు సల్లూ భాయ్. భారత దేశానికి రక్షణగా నిలిచే నేవీ సైనికులతో ఆడి పాడటం వారిలో ఆనందాన్ని నింపింది. వారితో కలిసి రోజంతా గడపడం అటు సైనికుల్లో, ఇటు సల్మాన్ ఖాన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. వేడుకలు ఆద్యంతం సందడిగా సాగాయి. చివర్లో నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్.. ఫోటోలకు ఫోజులిచ్చారు. పలువురు నేవీ సిబ్బంది సల్మాన్ ఖాన్ తో సెల్ఫీలు దిగారు. 


ఆగస్టు 15, రిపబ్లిక్‌ డేలు సందర్భంగా సెలబ్రిటీలు సైనిక స్థావరాలకు వెళ్లి వారితో సరదగా గడపడం ఎప్పటి నుంచో ఉంది. టాలీవుడ్ హీరోలు కూడా అలా వెళ్లి సైనికులతో ముచ్చటించారు. రోజంతా వాళ్లతో ఉన్నారు. ఆ వరుసలో మహేష్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్, విజయ్‌దేవరకొండ ఉన్నారు. ఆయా సందర్భాల్లో దేశ సైనికుల వద్దకు వెళ్లారు. వాళ్లతో ఆడుతూ పాడుతూ అక్కడే రోజంతా గడిపారు. ఇన్నాళ్లు జరిగిన వేడుకలు ఒక ఎత్తు అయితే ఈసారి జరుగుతున్న సంబరాలు మరో ఎత్తు.