Srikakulam Tourist Place: గిరిజన ప్రాంతమంటే ఎటు చూసినా పచ్చటి తివాచీ పరిచినట్టుగా కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాలు ఏ సంగీతం కూడా పనికి రాదంటే అతిశయోక్తి కాదు. ప్రకృతిపరంగా సిద్ధంచే పర్యాటక కేంద్రాలేవి అంటే కొండలపై కనిపించే అందాలని వేరేగా చెప్పనక్కర్లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలిలో అడలి అనే ఆదివాసీ గ్రామం ఇప్పుడు పర్యాటకులకు కొత్త పర్యాటక ప్రాంతంగా మారింది. ఆ కొండపై ఐటీడీఏ ఆధ్వర్యంలో రహదారి తదితర సౌకర్యాలు కల్పించడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వాసులనే కాదు... ఒడిశావాసులకు డెస్టినేషన్‌గా మారింది. అడలి వ్యూ పాయింట్ చూసి మయమరచిపోతున్నామంటున్నారు.
ప్రకృతే చీర కట్టుకుందా అన్నట్లు అబ్బురపరిచే పచ్చదనం, కాఫీ తోటలు చూపు తిప్పుకోనివ్వని మంచు గిరులు, జల సవ్వళ్లు. ఇలా ఒకటేమిటి ఎన్నో సుందర మనోహర దృశ్యాలు. వింటేనే మనసు పులకరించిపోతుంది కదూ. వీటన్నింటికీ నెలవైంది అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ప్రతీ ప్రాంతమూ మణిహారమే. అడుగడుగునా ఏ మూల చూసినా ప్రతీదీ అద్భుతమే. సీజన్ ఏదైనా ఏజెన్సీ అందాలు ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.
రకరకాల చెట్లు, వివిధ వర్ణాల పక్షులు చూసి సందర్శకులు పరవశించిపోతూ ఫొటో షూట్‌లు చేస్తున్నారు. చిరకాలం గుర్తుండేలా జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించి మైమరచిపోతున్నారు. మన్యంలో ప్రకృతి సిద్ధంగా కనిపించే పర్యాటక కేంద్రాలకు కాస్తా సౌకర్యాలు కల్పిస్తే సీతంపేట మండలంలోని అనేక గ్రామాల్లోని కొండలు పర్యాటక ప్రాంతాలుగా వెలసి పోతాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోగల గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం, కురుపాం, భామిని మండలాల్లో అనేక ప్రాంతాలు అడలిలాగానే ఉన్న గిరిజన గ్రామాలు అనేకం.