CM Jagan : సీఎం జగన్ శుక్రవారం విశాఖలో పర్యటించారు. ఈ పర్యటనలో  తన కాన్వాయ్‌ ఆపి ప్రజల సమస్యలు విన్నారు సీఎం జగన్.  శ్రీకాకుళం జిల్లా డీఆర్‌ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంకి రామారావు, సుబ్బలక్ష్మి సీఎంను కలిసి తమ బిడ్డల అనారోగ్య సమస్య వివరించారు. శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరారు. తమ కుమారులిద్దరూ సికిల్‌బెడ్‌ థలసేమియాతో భాదపడుతున్నారని, వారి శస్త్రచికిత్సకు సాయం అందించాలంటూ ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.  పిల్లల ఆరోగ్య పరిస్థితి చూసి చలించిన సీఎం  వైఎస్‌ జగన్, వారికి అవసరమైన సాయం చేయాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.  



కలెక్టర్ కు ఆదేశాలు 


పెదవాల్తేరుకు చెందిన ధర్మాల త్రివేణి తన ఇద్దరు బిడ్డలతో సీఎం కాన్వాయ్ రూట్ లో నిలబడి ఉండడాన్ని గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు.  కొద్దిరోజుల క్రితం తన భర్త హత్యకు గురయ్యాడని, ఇద్దరు చిన్న పిల్లలతో కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎంకు సమస్యను వివరించారు త్రివేణి. త్రివేణి కుటుంబానికి తగిన న్యాయం చేయమని విశాఖ జిల్లా కలెక్టర్‌ సీఎం జగన్ ఆదేశించారు.  


పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఎంవోయూ


ఏపీలో ప్లాసిక్‌ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. నేడు విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై సీఎం మాట్లాడుతూ.. నేడు ఒక్కరోజే ఉదయం 6 నుంచి 8 వరకూ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి అనేవి నాణేనికి రెండు వైపులు అని జగన్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు. 


ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్‌ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్‌ సమక్షంలో పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీ సైకిల్‌ చేసి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాకుండా, పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారని సీఎం జగన్‌ వెల్లడించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ ని ఏపీలో తొలి అడుగుగా సీఎం జగన్‌ చెప్పారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్లాస్టిక్‌ ను రీసైక్లింగ్‌ చేసి తయారు చేసిన షూస్‌, కళ్ల జోడులను సీఎం స్వయంగా చూపించారు. ఆయన కళ్ల జోడు ధరించగానే కన్వెన్షన్ హాల్ మొత్తం ఈలలతో దద్దరిల్లింది.


Also Read : Plastic Flexies Ban: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్, రేటు ఎక్కువైనా అలాంటివి పెట్టుకోండి: సీఎం ప్రకటన