Breaking News Telugu Live Updates: ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి శనివారం కన్నుమూశారు. రాత్రి 8.50 నిముషాలకు చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. సీతామాలక్ష్మి, త్రిశూలం, జానకి రాముడు, గోరింటాకు , నారీ నారీ నడుమ మురారి చిత్రాలను కాట్రగడ్డ మురారి నిర్మించారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కార్లపై జనసైనికుల రాళ్ల దాడికి యత్నించారు. మంత్రి జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసైనికులు కర్రలు, రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. విశాఖ గర్జన ముగించుకొని వైసీపీ నేతలు ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. పోలీసుల రక్షణలో వైసీపీ నేతలు ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లిపోయారు.
మునుగోడు నియోజకవర్గం...
నారాయణపురం మండలం..
గుజ్జ గ్రామంలో రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు..
గో బ్యాక్ రాజ్ గోపాల్ రెడ్డి అంటూ అడ్డగించిన గ్రామస్థులు..
అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు..
రాజ గోపాల్ రెడ్డి ప్రచారాన్ని మునుగోడు వ్యాప్తంగా అడ్డుకుంటున్న గ్రామస్తులు మొన్న ఆల్లాపురం,నిన్న సోలి పురం ,ఈరోజు సంస్థాన్ నారాయణాపురం మండలం గుజ్జ గ్రామంలో ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
మూడు రాజధానులకు మద్దతుగా శనివారం విశాఖలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహిస్తున్నారు. రేపటి విశాఖ గర్జన రూట్ మ్యాప్ విడదల చేసింది జేఏసీ. శనివారం ఉదయం 10 గంటలకు LIC బిల్డింగ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా జైల్ రోడ్, సిరిపురం, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా బీచ్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకూ ప్రదర్శనగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద భారీ సభ నిర్వహించనున్నారు. ర్యాలీ జరిగే సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.
ఐటి సోదాలు అప్డేట్స్.....
హైదరాబాద్ లో తెల్లవారు జాము వరకు కొనసాగిన ఐటి సోదాలు...
ఈరోజు మరోసారి కొన్ని చోట్ల సోదాలు చేస్తున్న ఐటి అధికారులు...
ఆర్ ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్, బిగ్ సి, లాట్ మొబైల్ షో రూమ్ లలో రెండవ రోజు కొనసాగుతున్న ఐటి సోదాలు..
నిన్న జరిపిన సోదాల్లో షో రూమ్ ల డాక్యుమెంట్లు, ఆర్థిస్క్ లు స్వాదినం చేసుకున్న ఐటి అధికారులు..
స్వాదినం చేసుకున్న వాటిని పరీశీలిస్తున్న ఐటి శాఖ..
షోరూమ్స్ లో వచ్చిన లభాలను రీయల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు...
హైదరాబాద్ నగరం లో భారీ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలు..
ఆదాయ పన్ను అవకతవకల పై ఐటి ఆరా.
-Telangana News : మునుగోడు ఉప ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ, మునుగోడు టిక్కెట్ ఆశించి నిరాశకు గురైన బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. మాజీ ఎంపీ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Background
మూడు రాజధానులకు మద్దతుగా శనివారం విశాఖలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహిస్తున్నారు. రేపటి విశాఖ గర్జన రూట్ మ్యాప్ విడదల చేసింది జేఏసీ. శనివారం ఉదయం 10 గంటలకు LIC బిల్డింగ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా జైల్ రోడ్, సిరిపురం, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా బీచ్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకూ ప్రదర్శనగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద భారీ సభ నిర్వహించనున్నారు. ర్యాలీ జరిగే సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.
ఉపరితల ఆవర్తనం బలపడి తేలికపాటి అల్పపీడనంగా మారింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేడు సైతం ఏపీ, తెలంగానలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మధ్య బంగాళాఖాతం, కొమరిన్ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తా తీరాల వైపు కదులుతుందని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాలు రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా
బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావం రెండు రోజుల వరకు రాష్ట్రంపై ఉండనుంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 16 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
నేడు సైతం రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు వర్ష సూచనతో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని గంటల్లో సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ములుగు, కరీంగనర్, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
కోస్తాంధ్రలోని సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, కాకినాడ, కొనసీమ, పశ్చిమ గోదావరి (కోస్తా భాగాలు మాత్రమే) జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అత్యధికంగా కొనసీమ జిల్లాలోనే వర్షాలుంటాయి. కొన్ని చోట్లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడ పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంది. నేడు కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పలుచోట్ల వర్షాలు పడతాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. కానీ కడప జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలతో పాటుగా సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ వర్షాలుంటాయి. కానీ గత ఐదు రోజులతో పోలిస్తే ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో తక్కుగానే వర్షాలుండే అవకాశాలున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -