Stone pelted at YS Jagan in Vijayawada- అమరావతి: తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం అన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ఖండించాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, హింసను ప్రతి ప్రజాస్వామిక వాదులు అంతా ఖండించాల్సిందే అని పేర్కొన్న వైఎస్ షర్మిల.. సోదరుడు జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.






ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిని వైసీపీ నేతలు, తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోలేక భయంతో జగన్ పై రాయి దాడి చేయించారని టీడీపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టి నిందితులు, దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారన్నారు.



చంద్రబాబు దాడి చేయించారనిఆరోపణలు.. 
సీఎం జగన్‌పై పచ్చ గూండాలతో టీడీపీ అధినేత చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ నేతలు చేసిన పిరికిపంద చర్య అని వైసీపీ మండిపడుతోంది. వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని సూచించారు. జగన్ పై జరిగిన రాళ్ల దాడికి ఏపీ ప్రజలు మే 13న సమాధానం చెప్తారని సూచించారు.






జగన్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు
సీఎం వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై నిష్పాక్షికంగా విచారణను చేపట్టి, బాధ్యులైన వారిని శిక్షించాలని ఎన్నిక కమిషన్‌ను కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశరాు.