Vijayawada Crime News: విజయవాడలో కలకలం రేపిన లోకో పైలట్‌ హత్యకేసును పోలీసులు ఛేదించారు. డి.ఏబేలును హత్య చేసిన వ్యక్తిని రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడిని గుర్తించి పట్టుకున్నారు. పోలీసుల విచారణ ఆ వ్యక్తి కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. 


విజయవాడలో డి.ఏబేలు అనే రైల్వే షంటింగ్‌ లోకో పైలెట్‌ బుధవారం హత్యకు గురయ్యారు.  రైల్వేస్టేషన్‌లోని ఎఫ్‌ క్యాబిన్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చంపేశాడు. ఇనుపరాడ్‌తో తలపై బాది చంపేశాడు. తీవ్రం గాయాలు పాలైన ఏబేలును సహచరులు గుర్తించి పక్కనే ఉన్న రైల్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఏబేలు చనిపోయాడు. 


విధి నిర్వహణలో ఉన్న లోకో పైలట్‌ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇది ఎవరి పని అనే చర్చ సాగింది. డబ్బుకోసం హత్య చేశారా లేకా ఏదైనా కారణం ఉందా అన్న యాంగిల్‌లో పోలీసులు విచారణ చేపట్టారు. సహజంగానే విజయవాడలో హత్యకు కారణమైన బ్లేడ్‌ బ్యాచ్‌ హస్తం లేదా గంజాయి బ్యాచ్ పనిగా అనుకొని విచారణ చేపట్టారు. 


స్థానికంగా ఉన్న సిసిఫుటేజ్ పరిశీలించిన పోసీలుకు ఓ వ్యక్తి అనుమాస్పదంగా ఉన్నట్టు కనిపించింది. దాని ఆధారంగానే దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకునేందుకు రెండు టీమ్‌లను ఏర్పాటు చేశారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో దర్యాప్తు సాగింది. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. 


గంటల పాటు శ్రమించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అరెస్టు కూడా చేశారు. ఇతను వరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. డబ్బుల కోసం హత్యలు చేయడం అలవాటుగా మారింది. హత్య చేసిన తర్వాత వాళ్ల ఊరికి వెళ్లిపోయి మళ్లీ డబ్బులు అయిపోయాక ఇక్కడకు వచ్చి హత్యలు చేయడం పరిపాటిగా మారినట్టు సమాచారం. గత నెలలో కూడా రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ పాన్ షాప్ యజమానిని హత్య చేసింది ఈ వ్యక్తేనని అంటున్నారు. 


ఈ హత్యతోపాటు విజయవాడలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటలు తరచూ జరుగుతుండటంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిసి కెమెరాలు సక్రమంగా పని చేసేలా చూస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలు ఉన్నా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Also Read: రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు