Vijayawada court quashes case registered against Devineni Uma and TDP leaders | అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును విజయవాడ కోర్టు కొట్టేసింది. ఈ కేసుపై విజయవాడ సీ ఎం ఎం కోర్టు విచారణ జరిపింది. మొత్తం 25 మందిని విచారించిన కోర్టు..  సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. పిటిషనర్ తరపున న్యాయవాది గూడ పాటి లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు. జక్కంపూడిలో గతంలో అక్రమ మైనింగ్ ఆరోపణలతో పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నేతలపై గత వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.